Connect with us

Financial Assistance

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ గ్రామ విద్యార్థి ఉన్నత విద్యకు Ravi Potluri తోడ్పాటు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి కర్నూలు జిల్లా (Kurnool District) లోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థి కె. ఈరన్న‌ ఇంటర్మీడియెట్‌ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి 1.5 లక్షలు సహాయం అందించి మోషన్ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిస్తున్నారు.

రవి పొట్లూరి (Ravi Potluri) ప్రోత్సాహంతో ఈరన్న ఇంటర్మీడియెట్‌ బైపీసీ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి 440 మార్కులకు గాను 425 మార్కులు సాధించాడు. ఈరన్న చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఈరన్నను అభినందించారు.

కప్పట్రాళ్ళ (Kappatralla) గ్రామంలో పదవతరగతిలో టాపర్‌ గా వచ్చిన ఈరన్న ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్‌ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఈరన్న‌ మాట్లాడుతూ, రవి పొట్లూరి (Ravi Potluri) గారి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు.

డాక్టర్ అవ్వాలని తన కోరిక అని, కష్టపడి చదువుకుని డాక్టర్ సీటు సాధించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడానికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని, సహకరిస్తున్న తానా ఫౌండేషన్ (TANA Foundation) మాజీ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లికి (Sasikanth Vallepalli) ఈ సందర్భంగా రవి పొట్లూరి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్ (Muppa Raja Sekhar), మోషన్ రెసిడెన్షియల్ కళాశాల (Motion Education Kurnool) కరస్పాండెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected