Connect with us

Donation

Ravi Potluri: బాలక్రిష్ణ సమక్షంలో బసవతారకం ఆసుపత్రికి వీల్ చైర్లు అందజేత

Published

on

భారతదేశంలోని ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్‌లలో ఒకటిగా పేరొందిన హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ (Basavatarakam Indo American Cancer Hospital & Research Institute) కు ఎన్నారై రవి పొట్లూరి ముప్పై వీల్ చైర్లు అందించారు.

ఈ రోజు జరిగిన కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ద్వారా వీల్ చైర్లని హాస్పిటల్ కి అందించారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో రవి పొట్లూరి అందించిన బ్రెడ్ ప్యాకెట్లను బాలకృష్ణ హాస్పిటల్ లోని ఐదు వందలకు పైగా రోగులకు పంపిణీ చేసారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, అలాగే లక్షలాది మంది అభిమానులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని పొట్లూరి (Ravi Potluri) తెలిపారు.

బాలక్రిష్ణ సమక్షంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవి పొట్లూరి తరపున ప్రతినిధులు ముప్పా రాజశేఖర్, సందడి మధు, జంపాల అమిత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected