Connect with us

Convention

పొట్లూరి రవి కన్వీనర్ గా ఫిలడెల్ఫియాలో తానా కన్వెన్షన్: లావు అంజయ్య చౌదరి, అధ్యక్షులు

Published

on

23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో 2023 జులై 7 నుండి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. తానా మహాసభల సైట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ యలమంచిలి అనిల్, సభ్యులు వీరపనేని పూర్ణ, మద్ది రామ్ బృందం తానా మహాసభల వేదిక కోసం అట్లాంటాతో పాటు పలు నగరాలలోని కన్వెన్షన్ సెంటర్స్ తో చర్చించారు.

తర్వాత ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ ను 2023 తానా మహాసభల వేదికగా సిఫార్సు చేయడం జరిగిందని, తానా సైట్ సెలక్షన్ కమిటీ సిఫార్సు కు తానా కార్యవర్గం మరియు బోర్డు ఆమోదం తెలపడం జరిగిందని అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. అలాగే తానా మహాసభల కన్వీనర్ గా పొట్లూరి రవి ని నియమించినట్లు తెలిపారు.

తానాలో రీజినల్ కోఆర్డినేటర్ నుంచి కార్యదర్శి వరకు పలు పదవులు నిర్వహించి, తానా కార్యక్రమాల నిర్వహణలో విశేష అనుభవమున్న పొట్లూరి రవి కన్వీనర్ గా, తానా సభ్యులు, నాయకత్వం, దాతల సహకారంతో 23వ తానా మహాసభలు అంగరంగ వైభవంగా జరపునున్నట్లు అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. కన్వీనర్ గా నియమించినందుకు అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి కి మరియు తానా కార్యవర్గానికి పొట్లూరి రవి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected