Connect with us

Donation

నారా లోకేష్ ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ కి NRI రవి మందలపు వితరణ: Mangalagiri, Andhra Pradesh

Published

on

అన్నిదానాల్లోకెల్లా అన్నదానము మిన్న అనే నానుడిని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద 2023 మే 23న ప్రజలకు ఉచిత భోజనం అందజేశారు.

అమెరికాలోని పెన్సిల్వేనియా వాసి, వ్యాపారవేత్త, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ 23వ మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు (Ravi Mandalapu) సహకారంతో 348వ రోజులో భాగంగా ఈ మంగళగిరి (Mangalagiri) అన్న కాంటీన్ నందు పేదలకు భోజనాలు ఏర్పాటుచేశారు.

అలాగే యలమంచిలిలో ఎన్నారై టీడీపీ విమెన్ వింగ్ ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ (Anna Canteen) కు 2023 మే 24న 276వ రోజులో భాగంగా రవి మందలపు వితరణగా సహాయం చేశారు. సమాజం పట్ల బాధ్యతగా పరబ్రహ్మ స్వరూపం అయిన అన్న దానంలో చొరవచూపడం అభినందనీయం.

పేదలకు అయిదు వేళ్ళు నోట్లోకెళ్లేలా తన వంతు బాధ్యతగా ముందడుగు వేసి సహాయం చేస్తున్న రవి మందలపు ని ఇటు పేద ప్రజలు అటు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు, అభిమానులు హృదయపూర్వక అభినందనలు అంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

అంతేకాకుండా అటు మంగళగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో, ఇటు యలమంచిలిలో ఎన్నారై టీడీపీ విమెన్ వింగ్ ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లో రెండిట్లోనూ ఒక నెలకి సరిపడా భోజనాలకి NRI రవి మందలపు స్పాన్సర్ చేయడం అభినందనీయం.

error: NRI2NRI.COM copyright content is protected