Connect with us

Associations

సంఘసేవలో రాజాధి రాజా.. రాజా కసుకుర్తి

Published

on

వంద మందికి సహాయపడలేకపోయినా ఒక్కరికి సహాయం చేయమన్న మదర్‌ థెరిస్సా స్ఫూర్తిగా, వంద కాదు కదా కొన్ని వేల మందికి సహాయపడే అవకాశాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఇచ్చింది అంటున్నారు రాజా కసుకుర్తి. రాబోయే తానా ఎన్నికల్లో తానా ఫర్ చేంజ్ అనే నినాదంతో సామాజిక సేవా కార్యక్రమాల సమన్వయకర్తగా టీం నిరంజన్ తరపున పోటీ చేస్తున్న విషయం విదితమే.

ప్రస్తుత న్యూజెర్సి తానా రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా, అంతకుముందు తానా బ్యాక్‌ప్యాక్‌ కో చైర్‌గా సీపీఆర్ శిక్షణా శిబిరాలు, మెగా హెల్త్‌ క్యాంపుల నిర్వహణ, పాఠశాలల అభివృద్ధి, రోడ్లు, విద్యుత్‌, విద్యాసౌకర్యాల మెరుగు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు సహాయం, ఏపి జన్మభూమి కార్యక్రమంలో 50 డిజిటల్‌ తరగతి గదులకు సహాయం, అమెరికాలోనూ ఇండియాలోనూ వేలాది మంది పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌లు, పాఠశాల సామాగ్రి పంపిణీ, తానా 5కె రన్‌, సంక్రాంతి సంబరాలు, వాలీబాల్‌ పోటీలు, ఫుడ్‌ డొనేషన్‌, తానా చైతన్య స్రవంతిలో మహిళలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, వ్యవసాయదారులకు రైతు రక్షణ కిట్లు, పవర్‌ స్ప్రేయర్ల పంపిణీ, యోగా ధ్యాన శిబిరాలు, స్థానిక ఆహార కేంద్రాలకు విరాళాలు, అష్టావధానం, ఘంటసాల వర్ధంతి వంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, పోచంపల్లి చేనేత కార్మికులకు ఆసు యంత్రాలు అందించడానికి విరాళాల సేకరణ, వివిధ రంగాలపై సదస్సులు, కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఆంధ్ర, తెలంగాణాల్లోని వేలాది పేద ప్రజలకు భోజనం, నిత్యావసర వస్తువులు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు ఫుడ్‌ ప్యాకెట్లు, అనాధ ఆశ్రమాలు, పాఠశాలలలోని పిల్లల కోసం దుప్పట్లు, ఆంధ్రప్రదేశ్‌ లో నిరుపేద మహిళలకు చీరల పంపిణీ, పోలీసులకు ప్రజలకు హెల్మెట్ల విరాళం, మరియు పిల్లలకు తానా వేసవి శిక్షణా శిబిరం వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామన్నారు.

తను గెలిస్తే మున్ముందు ఉత్తర అమెరికా అంతటా సిపిఆర్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం, బోన్‌ మారో డ్రైవ్‌, ఆటిజంపై అవగాహన, బ్లడ్‌ డ్రైవ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించడం, తానా బ్యాక్‌ప్యాక్‌ పంపిణీ కార్యక్రమంలో యూత్‌ను పాల్గొనేలా చేయడం, వివిధ బిజినెస్‌ సంస్థలతో మాట్లాడి తానా సభ్యులకు ప్రత్యేక డిస్కౌంట్‌ సదుపాయం కల్పించడం , చిన్నారులకు ఆన్‌లైన్‌ ద్వారా, నేరుగా సమ్మర్‌ క్యాంప్‌ల ఏర్పాటు , పేదలకు ఆహారము, అనాథ పిల్లలకు డ్రస్సులు, బొమ్మల పంపిణీ, పిల్లలకు తానా స్కాలర్‌షిప్‌లను ఇవ్వడం, అమెరికాకు వచ్చిన తల్లితండ్రులకు, విద్యార్థులకు ప్రత్యేక వైద్య సదుపాయాల కల్పన, వివిధ విషయాలపై సదస్సులు, నిష్ణాతులతో ప్రసంగాలు, యోగ, మెడిటేషన్‌ వంటి సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్తామన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected