Connect with us

News

FIFA ఫుట్బాల్ చరిత్రలో అరుదైన ఘట్టం, ఖతార్ ఆంధ్ర కళా వేదిక తొలి తెలుగు పాట

Published

on

ఫుట్బాల్ (FIFA) చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా తెలుగు పాటతో “ఫిఫా 2022” నిర్వహిస్తున్న ఆతిధ్య ఖతార్ దేశానికి కృతజ్ఞతాపూర్వకంగా ఆంధ్ర కళావేదిక ఖతార్ వారు శుభోదయం గ్రూప్ సహకారంతో తెలుగు పాటను విడుదల చేశారు. పలువురు సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు మరియు దేశ విదేశాలలోని తెలుగు సంఘాల అధినేతలు వారి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

శుభోదయం గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ లయన్ Dr శ్రీ లక్ష్మి ప్రసాద్ కలపటపు గారు, శ్రీ తనికెళ్ల భరణి గారు, శ్రీ సాయి కుమార్ గారు, శ్రీ తనికెళ్ల శంకర్ గారు, శ్రీ విక్టర్ అమల్రాజ్ గారు, TANA అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి గారు, TANA కల్చరల్ సర్వీస్ కో-ఆర్డినేటర్ శ్రీమతి శిరీష తూనుగుంట్ల గారు, వీధి అరుగు నార్వే అధ్యక్షులు శ్రీ వెంకట్ తరిగోపుల గారు, శ్రీ సాంస్కృతిక కళా సారధి సింగపూర్ అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్నకుమార్ గారు, మలేషియా తెలుగు సంఘం నుంచి శ్రీమతి సత్య మల్లుల గారు, హాంగ్ కాంగ్ నుంచి శ్రీమతి జయ పీసపాటి గారు, నైజీరియా తెలుగు సంఘం నుంచి శ్రీ ప్రవీణ్ గారు, తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ అధ్యక్షులు శ్రీ కుదరవల్లి సుధాకర్ గారు, సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి దీపికా రావి గారు, తెలుగు కళా సమితి ఒమాన్ కన్వీనర్ శ్రీ అనిల్ కుమార్ గారు, తెలుగు కళా సమితి బహరేన్ శివ యెల్లపు గారు, ఎం.బి. రెడ్డి గారు, కువైట్ నుంచి లలిత ధూళిపాళ గారు హాజరయ్యారు.

అలాగే అఖిలభారత తెలుగు సేన నుంచి శ్రీ PSN మూర్తి గారు, ప్రయాగ శర్మ గారు, శ్రీ విజయభాస్కర్ దీర్ఘాశి గారు, జిజ్ఞాస శ్రీ భార్గవ్ గారు, శ్రీ శివ శంకర్ గారు, S4J ఛానల్ అధినేత సురేష్ బాసంగి గారు, క్రీడాకారుడు కార్తీక్ యనమండ్ర గారు, ఖతార్ నుంచి ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) సలహా మండలి ఛైర్మన్ శ్రీ KS ప్రసాద్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీ కృష్ణకుమార్ గారు, ఆంధ్ర కళా వేదిక సలహా మండలి ఛైర్మన్ శ్రీ సత్యనారాయణ మలిరెడ్డి గారు, శ్రీ గొట్టిపాటి రమణయ్య గారు, దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ఫౌండర్ శ్రీ సయెద్ రఫీ గారు, శ్రీ ప్రసాద్ ఇంద్రగంటి గారు, శుభోదయం మీడియా సీఈఓ శ్రీ సూర్యప్రకాశ్ గారు, ఇలా పలువురు మాట్లాడుతూ తెలుగు వారి గౌరవాన్ని ఖండాతరాలు వ్యాపింప చేసేలా చేసే ఇంతటి అద్భుతమైన ఆలోచనకు, రూపకల్పనకు, దాన్ని అమలుచేసి నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని కొనియాడారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు శ్రీ వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రముఖుల రాకతో మరింత వన్నె వచ్చిందని, తమ కార్యవర్గం అతి తక్కువ (10 రోజుల) వ్యవధిలో ఇంతటి బృహత్కార్యానికి పూనుకొని అరుదైన రికార్డు సృష్టించడంలో కృతకృత్యులు అయ్యాయని తెలియజేశారు. ఈ పాట చిత్రీకరణలో ఫిఫా 2022 నిర్వహించే 8 స్టేడియంలు, ఖతార్ లోని చారిత్రాత్మక మరియు ప్రముఖ కట్టడాలు, అరబ్ దేశాల ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే సన్నివేశాలు చిత్రీకరించామని తెలియజేశారు.

ఇంతటి ఘనతను సాధించటానికి సహకరించిన ప్రాయోజితులు శుభోదయం గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ లయన్ Dr శ్రీ లక్ష్మి ప్రసాద్ కలపటపు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ పాటకు ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని ప్రత్యేకించి అరబీ భాష (హయ్య-హయ్య, హాబీబి) పదాలను అందించిన శ్రీ తనికెళ్ల శంకర్ గారికి, దానికి తగినట్టు అంతే అద్వితీయమైన బాణీ/సంగీతాన్ని సమకూర్చిన శ్రీ మాధవపెద్ది సురేష్ గారికి, తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత వన్నె తెచ్చిన శ్రీ S.P. చరణ్ గారికి, శ్రీమతి హరిణి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అంతేకాక ఈ పాట చిత్రీకరణకు మరియు ఎడిటింగ్ కు తమ సహకారాన్ని అందించిన శ్రీ జగదీశ్ అల్లం గారికి మరియు శ్రీ గోవర్ధన్ అమూరు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పాట చిత్రీకరణలో ముఖ్య భూమిక నిర్వహించిన శ్రీ విక్రమ్ సుఖవాసికి, పాట సాహిత్యం కోసం కృషిచేసిన శ్రీ వీబీకే మూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

తెలుగు వారి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే ఈ పాటని ప్రపంచంలోని తెలుగు సంఘాలు, తెలుగు వారందరూ తగిన గుర్తింపు వచ్చేలా ఈ పాటను షేర్ చేసి ప్రోత్సహించాలని ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ పేరు పేరున ఆయన కృతజ్ఞతలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected