Connect with us

Devotional

Minneapolis, Minnesota: బాబు కోసం టీడీపీ & జనసేన పూజలు

Published

on

తెలుగువారి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ప్రజా క్షేత్రంలోకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఎన్నారై టీడీపీ మిన్నెసోటా (NRI TDP Minnesota) మరియు జనసేన పార్టీ (Jana Sena Party) ఆధ్వర్యంలో సహస్ర నామ అర్చన కార్యక్రమం జరిపించారు.

అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేయబడి రాజమండ్రి జైల్లో 50 రోజులుగా వున్నా చంద్రబాబు గారు వెంటనే ఆరోగ్యంతో విడుదల అయి మరలా ప్రజాక్షేత్రం లో విజయం సాధించాలని పూజారులు దీవించిడం అయినది. ఈ మహత్తర పూజా కార్యక్రమం లో పాల్గొన్న నాయుడు గారి అభిమానులు అందరకి నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

గత 50 రోజులుగా ప్రపంచమంతా ఏదో ఒక చోట ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు తొందరగా బయటికి రావాలని ఆకాంక్షిస్తూ న్యాయస్థానంలో సత్వర న్యాయం జరగాలని కోరుతున్నారు.

ప్రతి క్షణం ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబునాయుడు గారు కోసం ఈనాడు ప్రపంచమంతా ముఖ్యంగా తెలుగువారు ఆయన రాక కోసం ఎంతో ఆశగా ప్రతిరోజు ఎదురుచూస్తూనే ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected