Connect with us

Devotional

చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని పూజలు @ Milpitas, Bay Area, California

Published

on

కాలిఫోర్నియా (California) రాష్ట్రం, బే ఏరియా (Bay Area) లోని మిల్పిటాస్ (Milpitas) లో ఉన్న వేద టెంపుల్ లో ఆరుగురు వేద పండితులు అత్యంత నిష్ఠతో నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గోత్ర నామాల మీద అర్చన చేశారు.

నారా చంద్రబాబు నాయుడు పట్ల YCP ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని, తిరిగి రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రిగా పాలనా నాయకత్వం వహించాలని, న్యాయస్థానాలు వేదికగా ఆయన చేస్తున్న ధర్మ పోరాటానికి దైవానుగ్రహం తోడవ్వాలని వేడుకుంటూ ఈ రోజు పూజ, అర్చనలు నిర్వహించటం జరిగింది.

నారా చంద్రబాబు నాయుడు కు ఆయురారోగ్యాలు సిద్ధించి తిరిగి అతి త్వరలో ప్రజా సేవలో పాల్గొంటారని వారు దీవించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం (Telugu Desam Party) పార్టీ మరియు జనసేన పార్టీ (Jana Sena Party) అభిమానులు హాజరయ్యారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected