Connect with us

People

బాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ టాంపాలో నిరసన, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్: Florida

Published

on

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకించాలని టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది. ‘బాబుతో నేను’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగం గా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల టాంపా నగరంలో NRI TDP టాంపా ఆధ్వర్యంలో ‘బాబుతో నేను’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్నారై టీడీపీ టాంపా (NRI TDP Tampa) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువకులు, టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శన సాఫీగా సాగిపోయింది. చంద్రబాబు చేసిన తప్పు ఏంటి? అంటూ ప్రజలకు ప్లకార్డులు సందేశం ప్రదర్శసించారు.

తాము ఈ రోజు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబే (Nara Chandrababu Naidu) అని ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారు తెలిపారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి లక్షలాది మంది తెలుగు వారు ఐటీలో స్థిరపడేలా చేశారన్నారు.

నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా అంటూ ప్లకార్డులు సందేశం ప్రదర్శసించారు. కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అంటూ పగలు, రాత్రి కష్టపడటం తప్పా? ప్రజా సమస్యలు కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీయడం అపరాధమా?

అవినీతిపై జగన్ (YS Jagan Mohan Reddy) ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాపమా? రాజకీయ కక్షతో చంద్రబాబు గారిపై పెట్టిన కేసును ఖండిద్దాం. తప్పుడు కేసులపై గళమెత్తుదాం. జగన్ కుట్రను ఎండగడదాం. ‘బాబుతో నేను’ అని చాటి చెపుదాం అని రాసి ప్లకార్డులు చేతబట్టారు.

తక్షణమే చంద్రబాబును విడుదల చేయాలని ఎన్.ఆర్.ఐ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు చంద్రబాబు మద్దతుదారులు ఎన్నారై టీడీపీ టాంపా కమిటీ సభ్యుల బృందాన్ని అభినందించారు. ఎన్‌ఆర్‌ఐ టిడిపి టాంపా కమిటీ ముందు నిలబడి దీనిని విజయవంతం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected