Connect with us

News

Orlando, Florida: చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన

Published

on

ఓర్లాండో, అమెరికా: నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండో నగరంలో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఈశ్వర్ కనుమూరి, రవి రావి మరియు వేణు సింగు సమన్వయపరిచారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాలు, ఐయామ్ విత్ సీబీన్ (I am with CBN) పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు (Nara Chandrababu Naidu) కు మద్దతుగా తమ సంఘీభావం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రవాసాంధ్రులు (NRIs) తగిన కృషిచేయాలని పిలుపునిచ్చారు.

అవినీతి అంతానికి న్యాయం గెలవాలని ఆకాంక్షించారు. ఈ నిరసన కార్యక్రమంలో శేషు ఆచంట, వినోద్, మురళీ రావి, గోపాల శివ వేళివెల్లి, జరుగుల డాక్టర్ బాబు రావు, రాజేష్, రమేష్, సురేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected