Connect with us

Events

ధీంతానా ఫైనల్స్‌ విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతుల అందజేత

Published

on

Detroit, Michigan: డిట్రాయిట్‌లో జరిగిన తానా (TANA) 24వ మహాసభల వేదికపై జరిగిన ధీమ్‌తానా ఫైనల్స్‌ పోటీలకు మంచి స్పందన వచ్చింది. ధీమ్‌ తానా (Dhim TANA) చైర్‌ నీలిమ మన్నె (Neelima Manne) ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వివిధ నగరాల్లో రీజినల్‌ పోటీలను నిర్వహించారు. ఈ ప్రాంతీయ పోటీలకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

మహాసభల వేదికపై జరిగిన ఫైనల్‌ పోటీలలో 11 ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 400 మందికి పైగా కళాకారులు పాల్గొని కొత్త రికార్డు సృష్టించారు. వేదికపై ప్రదర్శించిన ఈ అసాధారణ ప్రతిభకు న్యాయనిర్ణేతలు మంత్రముగ్ధులయ్యారు. ఉత్తర అమెరికాలో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారని ఈ పోటీలు మరోసారి నిరూపించాయి.

విజేతలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ (R. P. Patnaik) ఇతర ప్రముఖులు బహుమతులను అందించారు. ఈ పోటీల్లో గెలిచినవారిని, పాల్గొన్నవారిని ధీమ్‌ తానా (Dhim TANA) కమిటీ నాయకులు అభినందించారు.

సినీ నృత్య విభాగ విజేతలుగా
సబ్‌-జూనియర్స్‌ (Sub-Juniors) విభాగంలో ఆకర్ష వారణాసి, మోక్షిల నాయుడు దుంపల, ఈవా రషీద్‌, జియాన కొండ్ర, అక్షిత బాలకుమార్‌ రన్నరప్‌ గా సుక్రిత్‌ తుమికి, ఆర్నికా గోరిజావోలు, అభినవ్‌ కోగంటి, వరేణ్య చీమలకొండ, శౌర్య రుద్ర ఆత్మకూరి, కృతార్థ్‌ ఏలటి, అకిరా తొట్టెంపూడి, అభిషిక్త్‌ ఇరుజొల్ల, ద్వితీయ రన్నరప్‌ లుగా ఆశ్నా మంచినబెలే, శ్రేయాయుష నల్లాల, ఆద్యాశ్రీ ఇండగుల, భవిష్య కసు, లాస్య కొప్పకులా నిలిచారు.

జూనియర్స్‌ (Juniors) విజేతలుగా ఆరాధ్య తుమికి, ఆద్రిజా ముత్యాల, ఫణి సాయి అమేయ పెటేటి, పాయల్‌ కుమార్‌ పిల్ల, దీదీప్య శిరేమామిల్ల, యక్షిత్‌ ఏలటి, ఆర్నవ్‌ ముత్యాల, తమాన్‌ మొగిలి, ప్రథమ రన్నరప్‌గా రాయన్ష్‌ బొద్దు, అక్షిత బొద్దు, ద్వితీయ రన్నరప్‌ గా లాస్రిత బోరుసు, లక్ష్మి సహస్ర కుమ్మరశెట్టి నిలిచారు.

సీనియర్స్‌ (Seniors) విభాగంలో విజేతలుగా సహస్ర తుపాకులా, నందిని దాసరి, ప్రథమ రన్నరప్‌ గా హిమ ఆదిమూలం, అపూర్వ స్వామిశెట్టి, హన్సిని చల్లా, నక్షత్ర అబ్బూరి, జేష్ణ చామర్తి, సంజన ధనశేఖర్‌, యశ్వి దేవభక్తుని. ద్వితీయ రన్నరప్‌ గా ఆలేఖ్య వేలగ, సహస్ర సురవరపు, ధృతి తల్లూరి, వైష్ణవి చిలుములా, స్నిగ్ధ బూర్ల, వైష్ణవి మన్నవ నిలిచారు.

అడల్ట్స్‌ విభాగంలో…విజేతలుగా వీణ యేటూరు, కస్తూరి జయచంద్రన్‌, లక్ష్మి జయంత కుమార్‌, లావణ్య పెరతోటి, హిమాశ్రీ కండీ, శ్రావ్య గద్దె ప్రథమ రన్నరప్‌ లుగా స్వాతి గోపాలా, సౌజన్య యర్రంరెడ్డి, భవ్య పెంచాల, సౌజన్య దీవేల, హరిత, అవ్ని, కార్తీక్‌, విశిష్ట, పరిణీత, రిద్ధి నిలిచారు.

శాస్త్రీయ నృత్య విజేతలుగా
సబ్‌-జూనియర్స్‌ (Sub-Juniors) విభాగంలో విజేతలుగా శ్రేష్ఠ పాండే, నాగ పరిణీత ఓగేటి, అన్య నన్నపనేని, దేవంశి బిడ్డల, ప్రథమ రన్నరప్‌ గా వర్షిణి దొంగరి, శ్రేణ శ్రీహిత, ద్వితీయ రన్నరప్‌ గా అక్షిత బాలకుమార్‌, ఆకర్ష వారణాసి, ఈవా రషీద్‌, నైనాశ్రీ గొట్టిపాటి, రేనాశ్రీ గొట్టిపాటి, మోక్షిల నాయుడు దుంపల నిలిచారు.

జూనియర్స్‌ (Juniors) విభాగంలో విజేతలుగా లాస్య బోల్లెంపల్లి, శ్రీవేద సుంకరి, లాస్య పొలోజు, సాయిసాన్వి మక్కపాటి, హరిణి బాలాజీ, దీప్‌షిక తంగెళ్ళ. ప్రథమ రన్నరప్‌ లుగా లాహరి వైడ, విభ నరపరాజు, శ్లోక దేవభతుని, శ్రేయ కాకసాని, చార్వి వేణిశెట్టి, ద్వితీయ రన్నరప్‌ లుగా అక్షయ వేలంపల్లి, థాన్సి తాతిపాముల ఉన్నారు.

సీనియర్స్‌ (Seniors) విభాగంలో విజేతలుగా అనుశ్రీ మానేపల్లి, సహస్ర గాడే ఎంపికయ్యారు. ప్రథమ రన్నరప్‌ గా ద్యుతి, నిహాల్‌ బండ్ల నిలిచారు. అడల్ట్స్‌ విభాగంలో విజేతలుగా సాధన ఆదివి, మౌనిక దుర్భా, ఆశ్రిత ఆకులా, ప్రథమ రన్నరప్‌ లుగా శిల్ప బజ్జూరి, శ్రిత రెపాల నిలిచారు.

శాస్త్రీయ గానం
సబ్‌-జూనియర్స్‌ (Sub-Juniors) విభాగంలో విజేతగా రుహిక మాణికంటి, ప్రథమ రన్నరప్‌గా ఆరోన్‌ పొన్నంరెడ్డి, ద్వితీయ రన్నరప్‌ గా వైష్ణవి వాడిగచెర్ల నిలిచారు. జూనియర్స్‌ విభాగంలో విజేతగా హర్షిత నెలాభొట్ల ఎంపికయ్యారు. ప్రథమ రన్నరప్‌ గా శ్రీనిత్య చెరుకూరి, ద్వితీయ రన్నరప్‌గా సంయుత కోమలి నిలిచారు.

సీనియర్స్‌ (Seniors) విభాగంలో విజేతలుగా అనుశ్రీ మానేపల్లి, సహస్ర గాడే ఎంపికయ్యారు. ప్రథమ రన్నరప్‌ గా ద్యుతి, నిహాల్‌ బండ్ల నిలిచారు. అడల్ట్స్‌ విభాగంలో విజేతలుగా సాధన ఆదివి, మౌనిక దుర్భా, ఆశ్రిత ఆకుల, ప్రథమ రన్నరప్‌ లుగా శిల్ప బజ్జూరి, శ్రిత రెపాల నిలిచారు.

సినీ గాన విజేతలు సబ్‌-జూనియర్స్‌ (Sub-Juniors) విభాగంలో థాన్విక తబ్జుల్‌ విజేతగా నిలిచారు. ప్రథమ రన్నరప్‌ సియా అదెం, ద్వితీయ రన్నరప్‌ కృష్ణ చంద్రగిరి ఉన్నారు. జూనియర్స్‌ విభాగంలో ఉమ వేములపల్లి విజేతగా నిలిచారు. ప్రథమ రన్నరప్‌ రిత్విక తబ్జుల్‌, ద్వితీయ రన్నరప్‌ గా అధిప్‌ పిసిపాటి నిలిచారు.

సీనియర్స్‌ (Seniors) విభాగంలో విజేతగా అద్వైత్‌ బొండుగుల ఉన్నారు. ప్రథమ రన్నరప్‌ గా ఐశ్వర్య నన్నూర్‌, ద్వితీయ రన్నరప్‌ రిషిత్‌ గద్దె నిలిచారు. అడల్ట్స్‌ విభాగంలో విజేత శ్రీరంజిత శెట్టలూరు నిలిచారు.ప్రథమరన్నరప్‌ రాధా మాధురి కోటంరాజు, ద్వితీయ రన్నరప్‌ గా ప్రశాంత్‌ ఆర్రమ్‌ ఉన్నారు.

బ్యూటీ పేజెంట్‌ విజేతలుగా
మిస్‌ తానా (Miss TANA) 2025: విజేతగా ఆస్థా మామిడి నిలిచారు. ప్రథమ రన్నరప్‌ గా మోహన గ్రీష్మ గుడిమల్ల, ద్వితీయ రన్నరప్‌ గా గీతిక పిల్లలమర్రి ఉన్నారు.
మిస్‌ టీన్‌ (Miss Teen TANA) తానా 2025 గా విజేత లుగా మైథిలి గోవిందమ్‌, ప్రథమ రన్నరప్‌ గా శ్రీనిక తన్వి నీల, ద్వితీయ రన్నరప్‌ గా సంజన పొట్నూరు నిలిచారు.
మిసెస్‌ తానా (Mrs TANA) 2025 పోటీల్లో స్వప్నికా రాతకొండ విజేతగా నిలిచారు. ప్రథమ రన్నరప్‌ గా హర్షిణి తనుకు. ద్వితీయ రన్నరప్‌ గా ప్రశాంతి సుధా కోస్గి నిలిచారు.