Connect with us

Devotional

Columbus, Ohio: చంద్రబాబు కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు

Published

on

అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామ్యంగా అరెస్టు కాబడి గత 48 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో నిర్బంధంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నాయకులైన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యంతో వెంటనే విడుదల కావాలని మరియు తిరిగి ప్రజాక్షేత్రంలో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కాంక్షిస్తూ అమెరికాలోని ఒహయో (Ohio) రాష్ట్రంలో కొలంబస్ (Columbus) పట్టణంలో గల స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చంద్రబాబు గారి గోత్రనామాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడమైంది

ఈ Sri Venkateswara Temple of Central Ohio కార్యక్రమంలో స్థానిక తెలుగు మరియు తెలుగేతర ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కుటుంబ సమేతంగా పాల్గొని చంద్రబాబు నాయుడు గారి కోసం భక్తిశ్రద్ధలతో మనసారా ప్రార్థించారు. గత 45 సంవత్సరాలుగా ప్రతి క్షణం ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ను ఎంతో అభివృద్ధి చేశారు నారా చంద్రబాబు నాయుడు.

ఆయన (Nara Chandrababu Naidu) కోసం ఈనాడు ప్రపంచమంతా ముఖ్యంగా తెలుగువారు ఆయన రాక కోసం ఎంతో ఆశగా ప్రతిరోజు ఎదురుచూస్తూనే ఉన్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం చరిత్రలో ఒక చీకటి ఘట్టం. గత 45 రోజులుగా ప్రపంచమంతా ఏదో ఒక చోట ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఆయన తొందరగా బయటికి రావాలని ఆకాంక్షిస్తూ న్యాయస్థానంలో సత్వర న్యాయం జరగాలని కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected