అన్నిరంగాల్లో దినదినాభివృద్ధి చెందుతూ వ్యవసాయ రంగంలో మాత్రమే ఎందుకు కుచించుకుపోతున్నారు అని రైతులకు వ్యవసాయ రంగంలో చేయూత నివ్వాలనే దిశలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) రైతు కోసం తానా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా కీ. శే శ్రీ డి.వి. చలపతి రావు గారి స్మారకార్ధం వారి సతీమణి శ్రీమతి నారేసాలెపు సునీత గారి సహకారంతో జనవరి 8న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం, ఏలూరు జిల్లా (Eluru District), పెదవేగి మండలం, కొప్పాక గ్రామంలో తానా రైతు కోసం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గౌ” శాసన సభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) గారు హాజరయ్యారు. పంట దిగుబడిని పెంచడానికి ప్రతిభావంతంగా పనిచేసే విధంగా 10 Power Sprayers లను మరియు 10 Tarpaulins ను కొప్పాక, పెదకడిమి మరియు రామచంద్ర పురం గ్రామాలకు చెందిన పేద రైతులకు అందించారు.
దెందులూరు శాసన సభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మరియు గ్రామ పెద్దలు, ప్రముఖుల చేతుల మీదుగా స్థానిక హై స్కూల్లో ఈ Power Sprayers మరియు Tarpaulins అందించడం జరిగింది. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) మాట్లాడుతూ తానా సేవాకార్యక్రమాలను కొనియాడారు.
ఈ కార్యక్రమం లో కొప్పాక గ్రామ సర్పంచ్ శ్రీ దీక్షితులు గారు పెదకడిమి సర్పంచ్ బలరామకృష్ణ చౌదరి గారు, తానా సభ్యులు మేకా సతీష్ గారు MEO శ్రీ అరుణ్ గారు HM శ్రీమతి శైలజ గారు, ఎాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. గౌరవ శాసనసబ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తానా (TANA) కార్యవర్గాన్ని, గ్రామాలలొ రైతులకి తానా చెస్తున్న సెవలను ప్రశంసించారు.
సుధీర్ నారెపాలెపు (Sudheer Narepalepu) మరియు సతీష్ మేకా (Satish Meka) అధ్వర్యంలొ జరిగిన కార్యక్రమానికి సహకరించిన తానా కార్యదర్శి రాజా కసుకుర్తి గారికి, రైతుకొసం కమిటీ సభ్యులు రమణ అన్నె గారికి, జానయ్య కొట గారికి, అనిల్ యలమంచలి గారికి, వెంకట్ కొసరాజు గారికి, ప్రసాద్ కొల్లి గారికి, వీరలెనిన్ తాల్లురి గారికి, ప్రెమ కొమ్మరెడ్డీ గారికి, శ్రినివాస్ యలమంచి గారికి, సుధాకర్ బొడ్డు గారికి కొప్పాక గ్రామస్తులు అభినందనలు తెలియచెసినారు.