ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో బాలవికాస్ కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాలవికాస్ కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం 1వ తరగతి నుండి 6వ తరగతి విద్యార్థులకు చక్కని విద్యతో బాటు నైతిక విలువలను, మానసిక శారీరక వికాసాన్ని పెంపొందించడం, శ్లోకాలు, పాటలు, నీతి కథలు నేర్పించడం.
ఈ బాలవికాస్ కేంద్రాలకు కావలసిన మౌలిక సదుపాయాలను (బ్లాక్ బోర్డ్, పుస్తకాలు, పలకలు, పెన్సిల్లు , పెన్నులు, చేతి రాత పుస్తకాలు అలాగే ఆట వస్తువులైన కేరంబోర్డ్ , చెస్ బోర్డ్స్ , రింగ్ లు మొదలగునవి) తానా వారు అందివ్వడమే కాకుండా బాలవికాస్ శిక్షకులకు గౌరవ భృతిని అందిస్తున్నారు.
ఈ సంబరాలకు రాజాం లోని ప్రముఖులు హాజరయ్యి మరింత శోభను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు, శిక్షకులకు తానా మరియు తానా ఫౌండేషన్ లోగోలు వున్న బట్టలు పంపిణీ చేసారు. చివరిగా చిన్నారులు ‘థాంక్ యు తానా’ అంటూ వీడియో సందేశం ద్వారా కృతఙ్ఞతలు తెలియజేసారు.