Connect with us

Concert

ఏప్రిల్ 6న పోలండ్ లో మొట్టమొదటిసారి తెలుగు సింగర్స్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ @ PoTA Ugadi Vedukalu

Published

on

పోలాండ్‌లో మొట్టమొదటిసారి Poland Telugu Association (PoTA) వారిచే  తెలుగు LIVE మ్యూజికల్ కాన్సర్ట్ ను ఈ ఉగాది (Ugadi) పండుగ సందర్బంగా మరియు PoTA ప్రధమ వార్షికోత్సవాన్ని లిటిల్ ఇండియా వారి సమర్పణలో ఎంతో ఘనం గా చేయటానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలండ్ (Poland) లో ఉన్న తెలుగు వారందరినీ ఒక వేదిక మీదకు తీసుకు రావటానికి, అందరూ కలిసి ఈ క్రోధి  నామ సంవత్సర ఉగాది పండుగ (Ugadi Festival) ను ఉల్లాసంగా జరుపుకోవడానికి PoTA (Poland Telugu Association) చాలా కృషి చేస్తుంది.

తెలుగు సినిమా ప్లేబ్యాక్ సింగర్స్ (Tollywood Playback Singers) – పృధ్వీ చంద్ర, సాకేత్ కొమండూరి, మనీషా ఈరబత్తిని మరియు వారి బ్యాండ్, వార్సా (Warsaw) లో సంచలనం సృష్టించటానికి ఇచ్చిపాడ్  అనే బ్యాండ్ తో ఏప్రిల్ 6న పోలండ్ నుంచి యూరోప్ (Europe) టూర్ మొదలుపెడుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected