పోలండ్ తెలుగు అసోసియేషన్ (Poland Telugu Association – PoTA) వారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి (Ganesh Chaturthi) వేడుకలను క్రకోవ్ (Kracow) , గడన్స్క్ (Gdansk) నగరాల్లో 7 రోజులు పాటు ఎంతో వేడుకగా మరియు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
సెప్టెంబర్ 7, శనివారం విగ్రహ ప్రతిష్టాపన తో మొదలైన ఈ కార్యక్రమం, ప్రతి రోజు హారతి, దంపతుల పూజలు, గణేశుడి భజనలతో అలరించాయి. ఈ వినాయక చవితి ని మన తెలుగు వారి తో పాటు, ఇండియన్ కమ్యూనిటీ అంటే వివిధ రాష్ట్రాల ప్రవాస భారతీయలు వారు కూడా PoTA మండపాలను దర్శించి, స్వామి వారి ఆశీస్స్సులు తో పాటు ప్రసాదాన్ని స్వీకరించటం జరిగింది.
అంతే కాకుండా ఈ కార్యక్రమాలలో పోలండ్ దేశస్థులు (Poland Citizens) సైతం ఎంతో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని బొజ్జ గణపతి (Lord Ganesh) యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. Krakow లో నిర్వహించిన లడ్డు వేలం లో IT (Information Technology) ఉద్యోగులు పాల్గొని స్వామి వారి లడ్డు ని 70 వేలకు దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగటానికి PoTA (Poland Telugu Association) క్రకౌ చాప్టర్ కోర్ కమిటీ సభ్యులంతా ఎంతో నిబద్దతో శ్రమించారని, వారి యొక్క సహకారం మరువలేనిదని చాప్టర్ ప్రెసిడెంట్ చంద్ర అల్లూరి (Chandra Alluri), వైస్ ప్రెసిడెంట్ సుమన్ కుమార్ జనగామ (Suman Kumar Janagama) తెలిపారు.
చివరి రోజైన సెప్టెంబర్ 14, శనివారం నాడు ఆ గణనాధున్ని నిమజ్జనం చేసి స్వామి వారి ఆశీస్స్సులు తో వచ్చే సంవత్సరం వరకూ వేచి చూస్తామని Poland Telugu Association (PoTA) ప్రెసిడెంట్ చంద్ర భాను (Chandra Bhanu Akkala) గారు తెలిపారు.