Connect with us

News

Poland లో తెలుగువాసి మృతి, అస్తికలు & ఆర్ధిక విషయాల్లో PoTA సాయం

Published

on

పోలండ్ లోని తెలుగువాసి సోమసురెడ్డి డిసెంబర్‌ 16న మరణించారు. భారతదేశంలోని అతని కుటుంబానికి అండగా మరియు వారికి సహాయం చేసే బాధ్యతను PoTA (Poland Telugu Association) తన భుజాలపై వేసుకుంది. పోలాండ్‌లో అతి కష్టమైన, కీలకమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, వారి ఆస్తికలను భారతదేశంలోని కుటుంబ సభ్యులకు జనవరి 5న చేరవేశారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా, వారి కుటుంబ భవిష్యత్తు కోసం, అతని భార్య మరియు 8 నెలల పాపను ఆదుకోవడానికి నిధుల సేకరణ చేసారు. PoTA (Poland Telugu Association) పోలాండ్‌లో 18,634.73 PLN నిధిని సేకరించగలిగింది. ఈ సందర్భంగా దాతలందరికీ (Donors) హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

జనవరి 20న PoTA కమిటీ సభ్యుడు రామసతీష్ గారు భారతదేశంలోని సోమసురెడ్డి కుటుంబాన్నిపరామర్శించి వారి బిడ్డ కోసం SBI లైఫ్ బాండ్ మొత్తం 3,50,000 INR మరియు 25,000 INR నగదును వారి భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి భార్యకు అందజేసారు. ఈ ప్రక్రియలో అడుగడుగున ఎన్నో అడ్డంకులు, సవాళ్లు ఎదురయ్యాయి.

అయినప్పటికీ, కేవలం అంకితభావం, నిబద్ధత మరియు ప్రతి ఒక్కరి ప్రార్థనలతో, సోమసురెడ్డి కుటుంబానికి సహాయం చేయడానికి సాధ్యమైంది. పోలాండ్ (Poland) లో తెలుగు వారికి సహాయం చెయ్యడంలో Poland Telugu Association (PoTA) ఎల్లప్పుడు ఇదే విధముగా ముందు ఉంటుంది అన్ని అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected