పోలండ్ లో ఎప్పుడూ లేని విధంగా పోలండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారు ఈసారి దసరా, బతుకమ్మ వేడుకలను వర్సా (Warsaw), క్రాకోవ్ (Krakow), గ్దంస్క్ (Gdansk) నగరాల్లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ వేడుకల్లో మన తెలుగు ఆడపడుచులు, పిల్లలు బతుకమ్మను ఆటపాటలలో భక్తి శ్రద్ధలతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ (Telangana) సంస్కృతిని తెలిపేలా బతుకమ్మ (Bathukamma) సంబరాలను ఈ మూడు నగరాల్లో జరపటం తమ సంస్కృతి మరియు సాంప్రదాయాన్ని మరిచిపోలేదని నిరూపించారు.
బతుకమ్మ సంబరాలలో భాగంగా పోటా (Poland Telugu Association) వారు వర్సా లో మన తెలుగు ఆడపడుచులుకు పోటీలు నిర్వహించి ప్రత్యేక బహుమతులు అందజేశారు. PoTA కార్యవర్గం తరపున మహిళలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
Europe లో మన సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళడంలో అకుంఠిత దీక్షతో పని చేయడంలో Poland Telugu Association (PoTA) టీం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది అని ఈ కార్య క్రమాలతో వారు రుజువు చేశారు.