Connect with us

Jokes

మీరైనా ఏం చెయ్యాలో చెప్పి సాటి మగాడ్ని ఆదుకోండి!

Published

on

మాములుగా భార్యాభర్తల వాదనలలో భార్య గెలవడం అనేది అనాదిగా వస్తున్నా వింత ఆచారం. మరి ఈ భార్యాభర్తల ఆటలో ఎవరు గెలుస్తారంటారు? తినబోతూ రుచేందుకు? సరే చూద్దాం రండి!

భార్య: ఏమండీ సరదాగా ఓ ఆట ఆడదామా?

భర్త: సరదాగా ఆడితే కిక్కేముంది. ఏదైనా పందెం ఉంటేనే కదా మజా.

భార్య: సరే అలాగే, నేనోడిపోతే జీవితాంతం మీ మాటే వింటాను. మీరు ఓడిపోతే జీవితాంతం నా మాటే వినాలి, ఇదీ పందెం. సరేనా?

భర్త: డబుల్ ఓకే .

భార్య: సరే, ఇప్పుడు నేను ఒక రంగు పేరు చెబితే మీరు ఎడమ చెయ్యెత్తాలి. ఒకవేళ పండు పేరు చెబితే కుడి చెయ్యెత్తాలి. పొరపాటు చేస్తే మీరు ఓడిపోయినట్లే.

పోటీ మొదలయ్యింది…

భార్య: ఆరెంజ్

భర్త బుర్ర గిర్రున తిరిగింది. ఏ చెయ్యెత్తాలో తెలీక మూడ్రోజుల నుండి శిలా విగ్రహంలా అలాగే నిలబడ్డాడు. మీరైనా ఏం చెయ్యాలో చెప్పి సాటి మగాడ్ని ఆదుకోండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected