Connect with us

News

శివ సాయుజ్యాన్ని పొందిన పిడపర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, శనివారం విజిటేషన్ అవర్స్ @ Cumming, Georgia

Published

on

Atlanta, Georgia: అట్లాంటాకి చెందిన ప్రముఖ పూజారి పిడపర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి శివైక్యం చెందారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వయానా ప్రముఖ పూజారి ఫణికుమార్ (Priest Phanikumar Pidaparthi) గారి తండ్రి. ఈ శనివారం సెప్టెంబర్ 14న 12:30 నుంచి 1:30 వరకు కమ్మింగ్ లోని ఇంగ్రమ్ ఫ్యూనెరల్ హోమ్ (Ingram Funeral Home & Crematory) లో విజిటేషన్ ఏర్పాటు చేశారు. అనంతరం కర్మ కాండలు నిర్వహిస్తారు.

శ్రీ పిడపర్తి సత్యనారాయణ మూర్తి, శ్రీ సత్యవతి గారి 9 మంది సతానంలో 3 వ సంతానంగా శ్రీ పిడపర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (Pidaparthi Venkata Subrahmanyasastry) ఏప్రియల్ 1 , 1943 లో లక్కవరం తూర్పు గోదావరి (East Godavari District) జిల్లాలో జన్మించారు, 82 సంవత్సరములు ఆనందంగా జీవించారు.

ఎనిమిది సంవత్సరముల వయసునుండి చాలా కష్టపడి ఫ్యామిలీకి సహాయపడుతూ, పురోహితం నేర్చుకుని, యాత్రా స్పెషల్ నడుపుతూ, కాశీ , గయ, ప్రయాగ, అలహాబాద్, మథుర, శ్రీరంగం, కేదార్ నాథ్, బదరీ నాథ్, లాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో 25 సార్లు పైన దర్శించి, ఎన్నో (అన్ని) పుణ్య నదులలోనూ స్నానం ఆచరించి, యాజ్ఞాలు, యాగాలు చేయించి, దానాలు ధర్మములు చేస్తూ పుణ్యాత్ములుగా కీర్తి పొందారు.

2002 సంవత్సతం నుంచి అమెరికా (United States of America) వస్తూ వెడుతూ, గత 22 సంవత్సరముల నుండి అమిరికాలోనే, తన సొంత కుమారుడు, ఒకే ఒక్క కుమారుడు అయిన శ్రీ ఫణికుమార్ (Phanikumar Pidaparthi) గారి దగ్గర ఉంటూ, అట్లాంటా (Atlanta) లో అందరికీ పూజలు చేయిస్తూ, నిత్యం జపం, తపస్సు చేసుకుంటూ కాలం గడిపారు.

శ్రీ కీర్తి శేషులు వసుంధర విజయలక్ష్మి గారిని వివాహం చేసుకుని, ఆమెను చాలా బాగా చూసుకుని, ఆమెకు చివరి దశలో చాలా మంచి సేవచేసిన ధన్యులు. ⁠పాలకొల్లు (Palakollu) లోనే 60 సంవత్సరములు నివసించి, 40 సంవత్సరములు యాత్రలు చేయుచు, పాలకొల్లులోనే శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మించిరి, ఒక అమ్మాయిని పెంచుకుని, పెళ్ళిచేసి, గుడిలోనే నియమించిరి.

మంచి కొడుకుగా, మంచి భర్త గా, మంచి తండ్రి గా, మంచి మనిషిగా, ఎంతో మంది పురోహితులకు సహాయం చేస్తూ, సేవాకార్యక్రమాలలో పాల్గొని, బ్రాహ్మణ సంఘాలకు డొనేషన్స్ ఇస్తూ, ఏవన్మంది చుట్టాలకు, బంధువులకు సహాయపడుతూ, కొడుకుకు వేద విద్యనేర్పి, మంచి కొడుకుగా తీర్చిదిద్ది, హిందూ టెంపుల్ లో విశేష కార్యక్రమాలలో పాల్గొని, అందరిని ఆనందిపచేసి, ఆఖరి శ్వాస వరకు దైవ ఆరాధనలో, భగవత్ ధ్యానంలోనే ఉండి, సునాయాసంగా సెప్టెంబర్ 8 వ తేదీ రాత్రి పరమపధించి, శివ సాయుజ్యాన్ని పొంది స్వర్గస్తులయ్యారు, ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థన.

error: NRI2NRI.COM copyright content is protected