Connect with us

Telugu Desam Party

వైజాగ్ టీడీపీ నాయకులు మళ్ల అప్పారావు తో ఫిలడెల్ఫియా టీడీపీ అభిమానుల సమావేశం

Published

on

అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వైజాగ్ మాజీ కార్పొరేటర్ మళ్ల అప్పారావు ని ఆదివారం మే 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా తెలుగు దేశం పార్టీ అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుండి నిస్వార్ధంగా సేవలందిస్తున్న మళ్ల అప్పారావు లాంటి సీనియర్ నాయకులు తెలుగు దేశం పార్టీకి వెన్నెముక లాంటివారని, ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పార్టీకి పునర్వైభవం కోసం కృషి చెయ్యాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మళ్ల అప్పారావు మాట్లాడుతూ ఎన్ఠీఆర్ పిలుపు మేరకు అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చానని, ప్రవాసాంధ్రులంతా అధినేత చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చెయ్యాలని, పట్టాలు తప్పిన ప్రగతి చక్రాలని మళ్ళీ గాడిలో పెట్టి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి రవి, సునీల్ కోగంటి, గోపి వాగ్వాల, సతీష్ తుమ్మల, సాంబయ్య కోటపాటి, కోటి, పవన్ నడింపల్లి, ఫణి కంతేటి, విశ్వనాధ్ కోగంటి, మోహన్ మల్ల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected