Connect with us

Conference

‘తానా’రీమణులతో నారీ శక్తి @ Convention, మహిళలకు పెద్ద పీఠ వేసేలా రూపకల్పన

Published

on

ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః). అందుకే స్త్రీ సర్వత్రా పూజ్యనీయురాలు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.

ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. ఈ మహాసభల్లో మహిళలకు పెద్ద పీఠ వేసి పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జులై 8న ఉమెన్ ఎంపవర్‌మెంట్ – మెడికల్ (నారీశక్తి) పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పలురంగాలకు చెందిన మహిళా ప్రముఖులు పాల్గొని మాట్లాడనున్నారు.

శిరీష బండ్ల (అంతరిక్ష వ్యోమగామి), శ్రీమతి సత్యవాణి (భారతీయం), శ్రీమతి నందమూరి వసుంధర, సింగర్ చిత్ర, సుమ కనకాల, శ్రీలీల, లయ గొర్తి, సింగర్ సునీత పాల్గొనే ఈ కార్యక్రమానికి టీవీ 5 మూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

జులై 9న జరిగే కార్యక్రమంలో శైలజ అడ్లూరు (అడ్వకేట్) చంద్రబోస్ (రచయిత), సత్యవాణి (భారతీయం), జనేతా రెడ్డి (అటార్నీ), కౌసల్య (సింగర్), బాలాజీ ప్రకాశరావు (సోషల్ ఎంట్రప్రెన్యూరర్, ఊమెన్ అక్టీవిస్ట్) పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి టీవీ 9 రజనీకాంత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected