Connect with us

Movies

కోలాహలంగా ‘పాంచాలీ పంచభర్తృక’ సినిమా టైటిల్ లోగో & పోస్టర్ లాంచ్ కార్యక్రమం @ Atlanta, Georgia

Published

on

Atlanta, Georgia, January 3, 2025: పాంచాలీ.. పంచభర్తృక.. ఏమే.. ఏమేమే.. నీ ఉన్మత్త వికటాట్టహాసము.. అంటూ 1977లో వచ్చిన దాన వీర శూర కర్ణ సినిమాలో నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao – NTR) పలికిన డైలాగు ఇప్పటికీ సుపరిచితమే. తర్వాత అదే డైలాగుని పలు సినిమాలలో పేరడీలకు కూడా వాడారు.

కానీ ఇప్పుడు అదే డైలాగుతో ‘పాంచాలీ పంచభర్తృక’ (Panchali Pancha Bharthruka) అంటూ ఏకంగా ఒక సినిమానే నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లోగో మరియు పోస్టర్ లాంచ్ కార్యక్రమం జనవరి 3 శనివారం సాయంత్రం ఆల్ఫారెటా లోని కాకతీయ ఇండియన్ రెస్టారెంట్ ఈవెంట్ హాల్లో (Kakatiya Indian Restaurant) వైభవంగా నిర్వహించారు.

గంగాధర్ సప్తశిఖర (Gangadhar Sapthasikhara) దర్శకత్వంలో, రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్ & ఓం సాయిరాం ఆర్ట్స్ సమర్పణలో తెలుగుసినిమా కామెడీ చక్రవర్తి, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ (Gadde Rajendra Prasad), ప్రముఖ నటులు జెమినీ సురేష్, రోల్ రీడా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, శ్రీకాంత్ అయ్యంగార్ నటించడం ఒక ఎత్తైతే, అట్లాంటా నుంచి వెంకట్ దుగ్గిరెడ్డి మరియు పవన్ పూసర్ల నటించడం మరొక ఎత్తు.

ఇప్పటికే దాదాపు 11 సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంటున్న ఆల్ఫారెటా (Alpharetta, Atlanta) వాసి వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) తన 12వ సినిమాగా ‘పాంచాలీ పంచభర్తృక’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమా సినిమాకి ఇటు నటన అటు పాత్రల నిడివి పెంచుకుంటూ అందరి అభిమానాన్ని సంపాదిస్తున్నారు.

అలాగే ఈ సినిమాతో కమ్మింగ్ (Cumming, Georgia) వాసి పవన్ పూసర్ల (Pavan Pusarla) టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. డిఫరెంట్ లుక్ తో తనలోని కామెడీ యాంగిల్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేయనున్నారు. ఇంకా జబర్దస్త్ నవీన్, రూప లక్ష్మి, జయవాణి, రేష్మ సుల్తానా, రవి తదితరులు ఈ సినిమాలో నటించి అలరించనున్నారు.

ఈ సినిమా టైటిల్ లోగో & పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి అట్లాంటా (Atlanta) సినీప్రియులు, స్నేహితులు, మీడియా ప్రతినిధులు మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. లావణ్య గూడూరు (Anchor Lavanya Guduru) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దర్శకులు గంగాధర్ సప్తశిఖర (Gangadhar Sapthasikhara) పుట్టినరోజు సందర్భంగా అందరూ వీడియో ముఖంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సినిమాలపై వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) కి ఉన్న అభిరుచిని, ఎలాంటి భేషజాలు లేకుండా ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి తనను తాను మలచుకున్న విధానాన్ని అభినందించారు. అలాగే పవన్ పూసర్ల (Pavan Pusarla) కూడా ఈ సినీ ప్రయాణంలో విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు.

వెంకట్ దుగ్గిరెడ్డి (Venkat Duggireddy) మరియు పవన్ పూసర్ల (Pavan Pusarla) మాట్లాడుతూ.. కార్యక్రమానికి విచ్చేసి తమను ప్రోత్సహిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా (Social Media) ఉచ్చులో ఇరుక్కున్న కొందరి నేపథ్యంలో, లెస్ లాజిక్ మోర్ మ్యాజిక్ అంటూ నవ్వులు పంచేలా ఈ సినిమా సరదాగా సాగుతుందన్నారు.

దర్శకులు గంగాధర్ సప్తశిఖర చాలా చక్కగా తెరకెక్కించారన్నారు. అందరూ ‘పాంచాలీ పంచభర్తృక’ సినిమా రిలీజ్ రోజున వీక్షించి ఇదే మద్దతును తెలపాలని కోరారు. డిన్నర్ అనంతరం వందన సమర్పణతో (Vote of Thanks) ‘పాంచాలీ పంచభర్తృక’ సినిమా (Panchali Pancha Bharthruka Cinema) టైటిల్ లోగో & పోస్టర్ లాంచ్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

error: NRI2NRI.COM copyright content is protected