రైతుకోసం ‘తానా’ మరియు రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో 2023 చివరి రోజు, డిసెంబర్ 31 ఆదివారం రోజున ప్రకృతి వ్యవసాయం (Organic Farming), ఔషధ మొక్కలు సాగు, చిరుధాన్యాల సాగుపై అవగాహనా సదస్సు తానా (Telugu Association of North America) ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు (Guntur) జిల్లా, కొర్నెపాడు లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఈ తానా సదస్సులో స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార & ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి (Dr. Khadar Valli Dudekula) మరియు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ జెఎ చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ యంత్ర పరికరాలను, దేశీయ విత్తనాల స్టాల్ల్స్ ని సందరించారు. ఒక్కో రైతుకు ఒక కిలో కొర్ర విత్తనాలు మరియు ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కొర్నెపాడు మరియు పుల్లడిగుంట ప్రాంత రైతులు (Farmers) పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తానా (TANA) అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు వీడియో సందేశం పంపారు. రైతులకు ఉపయోగపడే ఈ అవగాహనా సదస్సు కి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 2024 లో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తామన్నారు. చివరిగా జై జవాన్ జై కిసాన్ అంటూ ముగించారు.