Connect with us

Cultural

కొత్త సంప్రదాయానికి  శ్రీకారం చుట్టిన NYTTA మహాశివరాత్రి & మహిళా దినోత్సవ సంబరాలు

Published

on

తెలంగాణా సంస్క్రతికి ప్రతిబింబమై, ప్రవాస తెలంగాణా ప్రజల వారధిగా ముందుకు దూసుకుపోతున్న న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) మొట్టమొదటిసారి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శివరాత్రి సంబరాలు & మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించి ఒక కొత్త సంప్రదాయానికి  శ్రీకారం చుట్టింది.

కొత్తగా మహాశివరాత్రి పండుగ కార్యక్రమానికి రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందింది. న్యూయార్క్ నగరం, మార్చి 4వ తేదీ శనివారం సాయంత్రం హిందూ టెంపుల్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 11గంటలదాకా ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన విభిన్నమైన సంగీత, సాంసృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆహుతులను ఉర్రూతలూగించాయి.

సంస్థ అధ్యక్షుడు శ్రీ సునీల్ రెడ్డి గడ్డం మరియు NYTTA డైనమిక్ టీం వాణి సింగిరికొండ, గీత కంకణాల, రవీందర్ కోడెల, హారిక జంగం,  ప్రసన్న మధిర, కృష్ణా రెడ్డి తురుక, పద్మ తాడూరి, హరిచరణ్ బొబ్బిలి, సుదీర్ సువ్వ, నరోత్తం రెడ్డి, అలేఖ్య వింజమూరి, మరియు ప్రవీణ్ కుమార్ చామ జట్టుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉషారెడ్డి మన్నెం, సహోదర్ పెద్దిరెడ్డి, పవన్ కుమార్ రవ్వ,  మల్లిక్ రెడ్డి,  మరియు NYTTA న్యూయార్క్ RVP సత్యారెడ్డి గగ్గినేపల్లి, సహాయ సహకారాలు అందించగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ప్రత్యేక ఆకర్షణగా  ప్రముఖ గాయని మధుప్రియ, రేలారే రేలా గంగ, శ్రావ్య మానస, శ్రీకాంత్ లంక ఆలపించిన పాటలు ఆహుతులను ఒక రేంజ్ లో ఊపేశాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన లావణ్య శ్రీనాథ్  మొత్తం కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నడిపించారు. కార్యక్రమంలో స్టానిక బాల కళాకారుల వెరైటీ నృత్యాలు, డ్యాన్సులు కనువిందు చేసాయి.

ప్రముఖ దర్శకులు కే. విశ్వనాద్ గారి సినిమా పాటల కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. అలాగే మ్రముఖ సినీనటి జమున గారి సినీ జీవితంపై మహిళలు ప్రదర్శించిన ప్రత్యేక పాటలు  నృత్యకార్యక్రమం ఆహుతులకు అమితానందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో NYTTA సభ్యులచే ప్రదర్శించిన నాటిక “భస్మాసుర వధ” ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.

ఈ కార్యక్రమానికి సమయాభావం వల్ల హాజరుకాలేకపోయిన సంస్థ శ్రేయోభిలాషులు  శ్రీ పైల్ల మల్లారెడ్డి గారు కార్యక్రమం విజయవంతం కావాలని తమ హృదయపూర్వక ఆశీస్సులు పంపించారు. అలాగే ఈ కార్యక్రమానికి TTA జాతీయ అధ్యక్షులు వంశీ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై తమ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా అందంగా ప్రచురించిన  “NYTTA సంబరాలు”-ప్రత్యేక సంచికను (సావనీర్) ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో న్యూయార్క్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన దిలీప్ చౌహాన్ గారఋ, సుష్మిత తో పాటు, డా. రాము రెడ్డి,  సుధాకర్ విడియాల, మరియు NYTTA సంస్థ చైర్మన్ డా. రాజేంద్ర జిన్నా, సంస్థ ఉప చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగు, సంస్థ అడ్వైజరీ బోర్డు శ్రీనివాస్ గూడూరు, అడ్వైజర్ చినబాబురెడ్డి  పాల్గోన్నారు. ఈ ప్రత్యేక సంచిక వెలువడడానికి ఎంతో కృషి చేసిన శ్రీనివాస్ గూడూరు మరియు హరిచరణ్ బొబ్బిలి అలాగే సావనీర్ కమిటీని అభినందించారు.

అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా NYTTA నిర్వహించిన డ్రాయింగ్, క్యాస్ట్యుం మరియు వ్యాస రచన పోటీలలో దాదాపు నలభై మంది పిల్లలు పాల్గోనగా గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సునీల్ రెడ్డి గడ్డం మాట్లాడుతూ కార్యక్రమ విజయానికి కృషిచేసిన తన సహచర NYTTA టీం సభ్యులకు, తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన BOD అధ్యక్ష కార్య కార్యదర్శులకు, BOD సభ్యులకు  శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా దాతలకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అద్భుతమైన సాంస్క్రుతిక కార్యక్రమాలు రూపొందించి ప్రదర్శించిన పిల్లలకు,  తల్లిదండ్రులకు టీచర్లకు ధన్యవాదాలు తెలియజేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected