శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు న్యూ యార్క్ తెలంగాణ తెలుగు సంగం (New York Telangana Telugu Association – NYTTA) ఆధ్వర్యంలో Selden Hindu Temple ఆవరణలో వందలాది భక్తుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది.
NYTTA ప్రతి సంహాత్సరం మాదిరిగానే 2024 కుగాను వినాయక చవితి పండగను Selden హిందు టెంపుల్ long island న్యూయార్క్ లో కొలహాలం గా ప్రారంభించి నవరాత్రులు, ప్రతి రోజు పూజ కార్యక్రమాలను జరుపుకొని, ప్రత్యేకంగా ఒక రోజు కిడ్స్ చే గణేశ పూజ జరిపించి, వారికీ గణే్స్ ప్రతిమ తోపాటు బుక్స్ పెన్సిల్స్ అంద చేయడం జరిగింది.
ఈ సందర్బంగా పూజలో పాల్గొన్న చిన్నారులు వారి పేరెంట్స్ తో ఆనందాన్ని వ్యక్త పర్చడం జరిగింది. ఈ సందర్బంగా NYTTA (New York Telangana Telugu Association) కార్యవర్గం వినాయకుడి పూజ కార్యక్రమానికి ప్రతి రోజు నైవేద్యం, ప్రసాదాన్ని భక్తులకి పంచడం జరిగింది.
ఈ నవరాత్రుల సందర్బంగా వినాయకుడి స్వామి (Lord Ganesh) వారి లడ్డుకి వేలం నిర్వహించగా వచ్చిన మనీ ని టెంపుల్ డెవలప్మెంట్ మరియు అనాధ ఆశ్రమం కొరకు వెచ్చించిడం జరుగుతుంది అని ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ (Vani Singirikonda) తెలియచేయడం జరిగింది.
అదేవిధంగా న్యూయార్క్ (New York) నగరంలోని ప్రముఖులు రోజు వారి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. లోకల్ ఫిలాంత్రపిస్ట్, వ్యాపారవేత్త NYTTA శ్రేయోభిలాషి Dr. పైల్లా మల్లా రెడ్డి (Dr Pailla Malla Reddy) దంపతులు పూజలో పాల్గొనడం జరిగింది.
నవరాత్రుల పదవ రోజు ప్రత్యేక పూజ జరుపుకొని ఉత్సవ వినాయకుడి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి తదుపరి భక్తుల కొలహలం మద్య ఎంతో ఉల్లాసభరితంగా, ఆనందహోత్సవంగా నిమజ్జనం కార్యక్రమాన్ని lido beach లో జరుపుకోవడం ద్వారా ఈ సంహత్సరం వినాయకుడికి వీడుకోలు జరపడం జరిగింది.
ఈ సందర్బంగా ప్రెసిడెంట్ వాణి గారు మాట్లాడుతూ వినాయక చవితి సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన సహచర కార్యవర్గానికి, బోర్డు అఫ్ డైరెక్టర్స్, అడ్వైసర్స్ మరియు టెంపుల్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేయడం జరిగింది. మరీముఖ్యంగా ప్రతి రోజు పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తు తుది నిమజ్జనం వరకు సహకరించిన పూజారి శ్రీ వేద వ్యాస్ గారికి ధన్యవాదములు తెలుపడం జరిగింది.