Connect with us

Health

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో Face Yoga Session విజయవంతం

Published

on

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం 2024 కార్యవర్గం ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమం “ఫేస్ యోగా“ (Face Yoga Session) ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సందర్భంగా నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజర్స్ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు.

మొదటిగా ఈ కార్యక్రమాన్ని జనరల్ సెక్రటరీ రవీందర్ కోడెల గారు నైటా (New York Telangana Telugu Association) ప్రేక్షకులను ఉద్దేశించి స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు. నైటా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ గారు ఉపన్యసిస్తూ… ఫేస్ యోగ ఇంస్ట్రక్టర్ డా. మధు నగేష్ గారికి నైటా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

NYTTA Board of Director సెక్రటరీ సతీష్ కల్వ గారు అందరిని ఫేస్ యోగా కార్యక్రమానికి ఆహ్వాంచడం జరిగింది, తదుపరి సంస్థ చైర్మన్ (NYTTA Chairman) డా. రాజేందర్ జిన్నా గారు మాట్లాడుతూ… ఈ సంవత్సరానికి గాను చక్కటి కార్యక్రమంతో ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు.

కార్యవర్గ సభ్యురాలు షాలిని రెడ్డి గారు డా. మధు నగేష్ గారిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి డా. మధు గారు ఫేస్ యోగా ను ఆన్లైన్ ద్వారా వివరించారు. ప్రేక్షకులు చాలా చక్కటి అనుభూతిని వ్యక్తపరచడం, ఫేస్ యోగా ఉపయోగాన్ని అందరు చక్కగా అర్ధం చేసుకోవడం జరిగింది.

తదుపరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. జాయింట్ సెక్రటరీ సౌమ్య శ్రీ గారు వోట్ ఆఫ్ థాంక్స్ (Vote of Thanks) చెప్పారు. ప్రెసిడెంట్ వాణి (Vani Singirikonda) గారికి అండ్ నైటా టీం అందరికి ధాన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా డా. మధు నగేష్ గారికి నైటా తరుపున కృతఙ్యతలు తెలియజేయడం జరిగింది.

నైటా శ్రేయోభిలాషి డా. పైళ మల్లారెడ్డి (Pailla Malla Reddy) గారికి, ఇతర దాతలకి మరియి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా మిత్రులకు, ఆహ్వానీతులు అందరికి కృతజ్ఞతలు తెలియచేయడం జరింగింది. తదుపరి కార్యక్రమం లో భాగంగా వైస్ ప్రెసిడెంట్ పద్మ తాదూరి గారు రాబోయే ప్రోగ్రామ్స్ గురించి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించారు.

ఈ సందర్బంగా ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ (Vani Singirikonda) గారు న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఫేస్ యోగా కార్యక్రమం (Face Yoga Session) విజయవంతం అవ్వటానికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected