ఎన్టీఆర్! ఈ మూడు అక్షరాలు వినగానే ప్రతి తెలుగోడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమాలైతేనేం, రాజకీయాలైతేనేం ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్. సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రాముడు ఎన్టీఆర్.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయాల్లో తెలుగునాట ఒక సంచలనం సృష్టించారు. అటువంటి దేశోద్ధారకుడు వచ్చే నెల మే 28న 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ శుభసందర్భంగా ఆ తారకరాముని అభిమానులు అమెరికాలోని నార్త్ కెరొలినా రాష్ట్రం, ర్యాలీ నగరంలో మే 27 శుక్రవారం రోజున పెద్ద ఎత్తున అన్నగారి శతజయంతి ఉత్సవం నిర్వహిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. అందరికీ ఏర్పాట్లు ఘనంగా చేసేందుకు వీలుగా మీ పేరు https://www.signupgenius.com/go/10C0E49ACAB2AA1FEC07-ntr100లోనమోదు చేసుకోండి అంటున్నారు నిర్వాహకులు.
ఈ వేడుకలకు సీనియర్ నటి ఎల్. విజయలక్ష్మి, రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, డా. నరేన్ కొడాలి, సింగర్ శారద ఆకునూరి ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ థీమ్ తో సాంస్కృతిక కార్యక్రమాలు, నేతల ప్రసంగాలు మరియు విందు భోజనం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు.