Connect with us

Birthday Celebrations

శకపురుషుడు NTR శతజయతి ఉత్సవాలు @ Y Kota, Andhra Pradesh

Published

on

శకపురుషుడు యన్.టి.ఆర్. శతజయతి ఉత్సవాలు, వై.కోట గ్రామస్తుల ఆద్వర్యంలో, నాగినేని రమణా యాదవ్ మరియు బిల్లా రమేష్ యాదవ్ పరివేక్షణలో రుచికరమైన వంటకాలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిదిగా, యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు, ఆత్మీయ అతిదిగా యన్.ఆర్.ఐ.టిడిపి గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి గారు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు మాట్లాడుతు.. నందమూరి తారక రామారావుగారు సరిగ్గా నేటికి 100 సంవత్సరాల క్రితం 1923 మే 28 సోమవారం, దైవం, మానవ రూపంలో ఈ భువిపై వెలసిన సుదినం. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననం కృష్ణాష్టమి పర్వదినం ఎలాగో తెలుగు వారికి ఈరోజు అంత పవిత్ర మైనది.

అదేవిదంగా ఇది తెలుగు జాతికి పండుగ రోజు, తెలుగు నాట ప్రతి ఇంట తేదీ మరువని రోజు. ఈ మహానాడు ఎప్పుడు వస్తుందా అని ప్రతి అభిమాని ఎదురుచూసే నేడే ఈ మహానాడు.. ప్రతి రోజూ…ప్రతి క్షణం… ప్రతి తెలుగు వాడి… గుండెల్లో… గూడుకట్టుకుని…. కొట్టుకునే … శబ్దం… ఎన్టీఆర్ అని యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ అధ్యక్షులు. నాగేంద్ర బాబు అక్కిలి అన్నారు.

అదే విదంగా యన్.ఆర్.ఐ. టిడిపి గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి మాట్లాతు, ఈ భువిపై మనల్ని మైమరిపించి…. దివిజనుల కోరిక మేరకు…. కొన్ని నాళ్ళు దైవ లోకంలో కూడా …తన నట ప్రదర్శనకు పయనమై వెళ్ళిన… మరణం.. లేని మహా నటుడు… ఎన్టీఆర్ . అసలు మరణమే లేని ఆ జననానికి… జయంతి అనటం సరి కాదు…. కనుక నేడు ఆయన జన్మదినమే …. ఈ శతాబ్దంమే కాదు…. ముందు ముందు ఇంకా ఎన్నో…యుగ యుగాలు…. కొలిచే….ఈ భూమిని తాకిన మరుపు రాని ఆ సుందర రూపం…. ఖచ్చితంగా ఆ పురాణ పురుషుడిదే అని వెంకట్ గారు కొని యడారు.

ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసిన, తెలుగువారికి, మరియు వై.కోట గ్రామస్తులకు, నాగినేని రమణా యాదవ్ మరియు బిల్లా రమేష్ యాదవ్ కి యన్.ఆర్.టిడిపి కువైట్ ప్రత్యక దన్యవాదములు తెలియచేస్తు, అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు, ఒక సంవత్సరం పాటు కుప్పం అన్నా క్యాంటీన్ లో ఆన్నదాన కార్యక్రమాలు, మెడికల్ కాంప్స్, సామాజిక సేవలు, రక్తదానాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ తెలుగుసమాజాలు మొత్తం యన్.ఆర్.టిడిపి కువైట్ వైపు చూసే విధంగా అనేక అంశాలపై చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్టీఆర్ గారి నామస్మరణతో, శఖపురుషునికి ఘనమైన నివాళులర్పించి ముగింపు పలికింది యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్, అని అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి, గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి గారు సంయుక్త ప్రకటనలో తెలియచేసారు.

ఈ వేడుకలలో పాల్గొన్న ముఖ్యనాయకులు: వై.కోట గ్రామస్తులు, వెనిగళ బాలకృష్ణగారు, చలపతి , రాణి చౌదరి, ఇందు రాయల్, చంద్రకాంత్, పోకల వెంకటేష్, విజయ్ కుమార్ పసుపులేటి, పేరూరు శివప్రసాద్, చమర్తి వెంకట్రామరాజు, కోడి రాజేష్, అద్దేపల్లి చిన్నారాజు, కుర్రా రమణా యాదవ్, దొడ్డిపల్లి సుబ్బరాజు, మహేష్ గౌడ్ కోడూరు, చంద్రాగౌడ్, కాటమ్ గౌడ్ , చిన్నా గౌడ్ , గుండయ్య నాయుడు, శంకర్ యాదవ్ , నాగినేని సుధాకర్ విజయ్, ఆత్మకూరు హరిప్రసాద్ రాజు, బాలరాజు వెంకట్రామరాజు, కోడూరు సుబ్రమణ్యంరాజు, మురి చంగయ్య,వేణు,అప్పకొండవెంకటేష్, కొత్తపల్లి రామయ్య, పెసల గంగయ్య, నాగినేని సుధ, మడకసిరి రాంప్రసాద్.

error: NRI2NRI.COM copyright content is protected