Connect with us

Birthday Celebrations

టెక్సస్ లోని ఆస్టిన్లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు: NRI TDP Austin

Published

on

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శతజయంతి ఉత్సవాలను ఆదివారం ఫిబ్రవరి 26న ఆస్టిన్, టెక్సస్ లో NRI TDP Austin విభాగం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుమారు 450 మందికి పైగా పాల్గొన్నారు.

ఈ వేడుకకు 450 మందికి పైగా ఎన్టీఆర్ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు, స్వరాంజలి టీం పాడిన పాటలు అభిమానులను ఎంతగానో అలరించాయి.

నందమూరి తారక రామారావు (NTR) జీవిత విశేషాలతో కూడిన బింగో, క్విజ్ ట్రివియా వంటి పలు ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రాంగణం అంతా ఎన్టీఆర్ ఫోటోలు, బ్యానర్స్ తో శోభాయమానంగా అలంకరించిన విధానం బహుపరాక్ అనేలా ఉంది. పలురకాల వంటలతో డిన్నర్ అదరగొట్టారు.

తన స్వాగత ప్రసంగంలో NRI TDP Austin అధ్యక్షులు లెనిన్ ఎర్రం మాట్లాడుతూ సినీరంగంలో మరియు రాజకీయరంగం లో NTR సాధించిన విజయాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా NRI TDP USA విభాగం కన్వీనర్ జయరాం కోమటి పాల్గొని సభనుద్దేశించి ప్రసంగించారు.

అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, అయన ఆశయాలను, తీసుకున్న వినూత్న నిర్ణయాలను రాబోయే తరానికి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని NRI TDP Austin టీం లోని ప్రతి సభ్యుడు స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతుగా కృషి చేసి విజయవంతంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected