Connect with us

Birthday Celebrations

ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా శక పురుషుని శత జయంతి ఉత్సవ వేడుకలు

Published

on

కువైట్ లోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ భవనంలో శక పురుషుని శత జయంతి ఉత్సవ వేడుకలు వెంకట్ కోడూరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్ప గారి శ్రీనువాసులు రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ్యుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామరావు గారు తెలుగు ప్రజల గుండెలో తారక రామరావు గారు స్థిరంగా నిలిచిపోయారు అన్నారు.

సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే తారక మంత్రం తో కోట్లాది మంది మనస్సు ని ప్రబావితం చేసిన మహోన్నత శక్తి అన్న గారు, సినీ వినీలాకాశం లో ధృవతారగా వెలుగోంది తెలుగుదేశం అనబడే దేవాలయం బడుగు బలహీన వర్గాల అండదండ కోసం శక్తి లాంటి పార్టీ ని స్థాపించి కేవలం ఎనిమిది మాసాల కాలం లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఎదురులేని మనిషి, కుళ్ళు పట్టిన రాజకీయ వ్యవస్థ ని ప్రక్షాళన చేసి రామరాజ్యం గా మార్చిన ఘనత ఆయనకే సొంతం, పంచభూతములు ఉన్నంతకాలం మరువలేదు తెలుగు జాతి మిమ్మల్ని అని ఆన్నారు.

వారి ఆశయ సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు,లోకేష్ బాబు గారు నిరంతరం ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరుడుతున్నారన్నారు, రాబోయే ఎన్నికలు ఏకపక్షంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిధ్దమయ్యారు ఏందుకంటే ఆనాడు జగన్ మోహాన్ రెడ్డి కి, రాజశేఖర్ రెడ్డి కొడుకు అని ఒక చాన్స్ ఇచ్చి పదవి ఇస్తే ఏదో చేస్తాడు అని నమ్మి జగన్ రెడ్డి ని గెలిపిస్తే, విద్యార్థులను, ఉద్యోగులను, అక్క చెల్లెలను అందరినీ నట్టేట ముంచాడు.

ఇప్పటికే 7.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన ఒక్కొక్కరి నెత్తిన 2 నుండి 3 లక్షల అప్పు పెట్టాడు. ఇలాంటోడికి మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఈ సారి 10 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్కరి నెత్తిన 5 లక్షలు పెడతాడు. ఇప్పటికే సొంత పార్టీ వాళ్ళే ఈయన్ని ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారని ఆన్నారు. కువైట్ లో ఏయిర్ పోర్ట్ లో దిగినప్పుడు నుంచీ మీరు చూపిస్తున్న ప్రేమాభిమానులు నా జీవితంలో మరవలేమాన్నారు, మీకు సర్వద రుణపడివుంటానాన్నారు.

ఇటీవల కువైట్ లో హాత్య కేసులో లక్కిరెడ్డిపల్లె వాసి ఆమాయుకుడికి శిక్ష పడిన వెంటనే వారి కుటుంబ సభ్యులు నా దగ్గర వచ్చిన వెంటనే మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర మంత్రి దృష్ఠికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయందాని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఏత్తిసెనది అని ఆన్నారు. ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్, ఎన్ఆర్ఐ టిడిపి కువైట్ మైనారిటీ విభాగం, ఎన్టీ ఆర్ సేవా సమితి కువైట్, చంద్రన్న సేవా సమితి కువైట్, ఎన్టీ ఆర్ సేవాధల్, పరిటాల ఏన్టీఆర్ ట్రస్ట్, ప్రవాసాంధ్ర నారా లోకేష్ యువత కువైట్, ప్రవాసాంధ్ర సేవా సమితి వారికి హృదయపూర్వక ధన్యావాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా నాయుకులు ఆంజన రెడ్డి చపాతి, నిర్మలమ్మ, ఆంజలి, సరస్వతి, నారాయణమ్మ నాయుకులు పిడికిట శ్రీనివాస, ముస్తాఖ్ ఖాన్, గుదె శంకరయ్య, ఓలేటి రెడ్డయ్య, షేక్ యండి ఆర్షద్, చుండు బాలరెడ్డయ్య, మహామ్మద్ బోరా, షేక్ సుబాన్, కోర్రపాటి వెంకటేశ్వర్లు, మద్దిన వెంకటేషు, వేగి వెంకటేష్, నాయినపాటి విజయ్, షయ్యద్ ఆలి, బాబు నాయుడు, జనార్ధన్ రెడ్డి, పచ్చా నరసింహా, టిక్ టాక్ రాజు, ఖాదిర్ భాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected