Connect with us

Celebrations

ఘనంగా నట సార్వభౌముని శతజయంతి @ Raleigh, North Carolina NRI TDP

Published

on

మే 28, 2023, Morrisville, NC: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా North Carolina NRI TDP వారు స్థానిక ఫ్యూజన్ 9 రెస్టారెంటు (Fusion 9 Restaurant) లో కేక్ కటింగ్ సెరిమొని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్నిNC NRI TDP కార్యనిర్వాహక సభ్యులు శ్రీ శ్రీనివాస్ అరెమండ, అధ్యక్షులు, శ్రీమతి మాధవి మార్తాల, ఉపాధ్యక్షురాలు, శ్రీ రాజీవ్ తలశిల, కార్యదర్శి, శ్రీ సురేష్ చల్లపల్లి, కోశాధికారి, శ్రీ శ్రీనాథ్ కడియాల, సోషల్ మీడియా కోఆర్డినేటర్, శ్రీ శ్రీధర్ గొట్టిపాటి, రీజినల్ కౌన్సిల్ రిప్రెజెంటేటివ్ అధ్వర్యంలొ నిర్వహించారు.

పలువురు అన్న గారి అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎన్.టి. రామారావు గారి చలన చిత్ర జీవితం గురించి, వారు నటించిన పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక, జానపద, స్వాతంత్ర పోరాటము ఆధారంగా తీసిన చిత్రాల (Movies) గురించి అభిమానులు ముచ్చటించారు.

మరికొందరు అభిమానులు నందమూరి తారక రామారావు (NTR) గారు ధరించిన పాత్రల వెనుక ఉన్న విశేషాలను, ఆ పాత్రలు వారికెటువంటి విజయాలను సాధించాయో వివరిస్తూ ఎందరికో తెలియని విషయాలను గూడ ప్రస్తావించారు.

అన్న నందమూరి తారక రామారావు (NTR) గారు క్రమశిక్షణకు, పాలనా నిబద్ధతకు నిలువెత్తు దర్పణమని ప్రసంశించారు. వందన సమర్పణతో కార్యక్రమాన్ని పూర్తిచేసి, ఆహూతులకు అల్పాహారవిందు సమకూర్చారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected