ఆస్ట్రేలియా దేశం, విక్టోరియా రాష్ట్రము లోని మెల్బోర్న్ నగరంలో ఎన్టీఆర్ శత జయంతి మరియు మహానాడు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులు గా బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర దేవి, చిన్న కూతురు తేజస్విని మరియు విశిష్ట అతిథులుగా తెలుగుదేశం నాయకులు పులివర్తి నాని, నన్నూరి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
డోల్ బృందం తో అతిథులు కు స్వాగతం పలకగా, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పలు సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ (NTR) పోషించిన పౌరాణిక చిత్రాలు లవకుశ, నర్తనశాల లోని పాత్రలు ఆధారం గా చిన్నారులు చేసిన నాటక ప్రదర్శన అహుతులని అబ్బురపరచింది.
అతిథులు మాట్లాడుతూ ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) చేసిన సేవలను కొనియాడుతూనే రానున్న ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కు సంబందించినవి కాబట్టి ఎన్నారైలుగా మీ మీద గురుతర బాధ్యత ఉంటుంది అని గుర్తు చేసారు.
విక్టోరియా పార్లమెంట్లో ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం
అనంతరం మరో ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మెలబోర్న్ లో ఉన్న విక్టోరియా (Victoria) రాష్ట్ర పార్లమెంట్లో ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నందమూరి వసుంధర దేవి, మరియు నందమూరి తేజస్విని (Nandamuri Tejaswini) సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా పార్లమెంట్ లోపల జరిగిన కార్యక్రమం లో కేబినెట్ సెక్రటరీ Mr. Steve Mcghie విక్టోరియా పార్లమెంట్ తరుపున వసుంధర దేవి (Nandamuri Vasundhara Devi) మరియు తేజస్విని గారితో పాటు పాల్గొన్న తెలుగు ప్రముఖులు కు ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తింపు గా ప్రత్యేక జ్ఞాపికలు ను అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వ Premier (ముఖ్యమంత్రి) చే అభినందన పత్రాన్ని త్వరలో అందిస్తాం అని తెలిపారు. ఎన్టీఆర్ చేసిన గొప్ప పనులను తాము తెలుసుకున్నాం అని తెలిపారు. మరో ప్రభుత్వ ముఖ్య అధికారి Mr. Lee Tarlamis చేతుల మీదుగా వసుంధర గారికి బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్న సేవలకు గాను పార్లమెంట్ తరుపున సర్వీస్ అవార్డు ని అందజేశారు.
విక్టోరియా పార్లమెంట్ ప్రత్యేకంగా చేయించిన మెమెంటోని అందుకున్న ఆమె ఆనందం వ్యక్తం చేసారు. అనంతరం NRI TDP Australia వారు రూపొందించిన జ్ఞాపికలును వసుంధర చేతుల మీదగా వారికి, పలువురు రాజకీయ నాయకులు కు అందజేశారు. ఈ కార్యక్రమం లో అధికార పార్టీ ప్రతినిధులు, ఎంపీ లతో పాటు ప్రతిపక్ష ఎంపీ లు స్థానిక రాజకీయాలలో ఉన్న తెలుగు వారు కూడా పాల్గొన్నారు.