“పేదవాడికి పట్టెడన్నం పెట్టాలి” అనే అన్నగారి సూక్తి ని అనుసరిస్తూ మరియు గత సంవత్సర అన్నదాన ఆనవాయితీ కొనసాగిస్తూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు (NTR) గారి 101 జయంతిని పురస్కరించుకొని జూన్ 30 ఆదివారం, ఉదయం 10 గంటలకు Jimmy Hale Mission లో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
అమెరికాలోని అలబామా (Alabama) రాష్ట్రం, బర్మింగ్హామ్ (Birmingham) నగరంలో ఈ NTR ఛారిటీ కార్యక్రమం నిర్వహించనున్నారు. కావున ఈ సేవా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయగలరని కోరుతున్నారు నిర్వాహకులు.