కువైట్ ఎన్నారై టిడిపి సెల్ ఆధ్వర్యంలో శక పురుషుని శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందిన నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి శత జయంతి వేడుకలు కువైట్ ఎన్నారై టిడిపి సెల్ వారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
2008 లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి కువైట్ లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన సీనియర్ నాయకులు శ్రీ వెంకట్ కోడూరి గారు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ బొర్రా గారు, ఎన్నారై టిడిపి కువైట్ మైనారిటీ విభాగం కమిటీ సభ్యులు, ఎన్నారై టిడిపి గల్ఫ్ కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ సేవా సమితి కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ పరిటాల ట్రస్ట్ మరియు చంద్రన్న సేవా సమితి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నారా, నందమూరి అభిమానులు అందరూ కలిసి పాల్గొని అన్న నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వీరందరూ కలిసి ఈ సంవత్సరం పొడవునా ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలు చేయాలని తీర్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ అతిథి వెంకట్ కోడూరి గారు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో అలాగే తెలుగు జాతి అభివృద్ధి కోసం చంద్రబాబు గారు ఏ విధంగా కష్టపడి పని చేశారో మనందరికీ తెలుసు. ఈ రోజు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతూ, శాంతి భద్రతలు విషాయంలో విఫలం అవ్వటం వలన ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వార్ధపూరిత రాజకీయ కుట్రల వలన వ్యవస్థలు ఏ రకంగా గాడి తప్పుతున్నాయో చూస్తున్నాం. ప్రజలు అప్రమత్తం అయ్యి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
అదే విధంగా శత జయంతి ఉత్సవాలు 2023 మే 28 వరకు జరుగుతాయి కావున జూన్ 10న ఒక కార్యక్రమం చేయడానికి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చంనాయుడు గారిని మరియు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారి సమయాన్ని బట్టి కువైట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల కోసం కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరుగుతుంది అని ఈ సందర్భంగా కువైట్ లో ఉన్న కార్యకర్తలకు తెలియజేశారు.
ఎన్నారై టిడిపి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ముస్తాక్ ఖాన్ గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మైనార్టీ హక్కుల, సంక్షేమ కార్యక్రమాలు విషయంలో అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఎన్నారై టీడీపీ గల్ఫ్ శంకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కువైట్ ఓలేటి రెడ్డయ్య చౌదరి మాట్లాడుతూ ఆరోజు చంద్రబాబునాయుడు గారు రాయలసీమ కోసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేస్తే దాని తర్వాత ఇంతవరకు కూడా పురోగతి లేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలారెడ్డయ్య, విజయ్ కుమార్ చౌదరి, ఖదీర్ బాషా, గౌహర్ అలీ, నారాయణమ్మ, అంజలి, అంజనా రెడ్డి , నిర్మలమ్మ, కరీముల్లా, బాబ్జీ, అస్లం,మహుమ్మద్ అలీ,మనోహర్,మహుమ్మద్, జబివుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ శత జయంతి ఉత్సవాలను ఎన్నారై టిడిపి సెల్ కువైట్ ఓలేటి రెడ్డి చౌదరి గారు, షేక్ యం.డి అర్షద్ గారు సమన్వయం చేశారు.