Connect with us

Telugu Desam Party

న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ విశ్వవేదికపై అన్న NTR@100

Published

on

ప్రపంచ వ్యాప్తంగా విశ్వనగరంగా పేరుపొందిన న్యూ యార్క్ నగరంలోని ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ టైమ్స్ స్క్వేర్ లో విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, స్వర్గీయ డా. నందమూరి తారకరామారావుకి (NTR) విశిష్ఠ గౌరవం దక్కింది.

నందమూరి తారక రామారావు శ‌త జ‌యంతిని (NTR@100) పురస్కరించుకొని మే 27 అర్ధరాత్రి నుండి మే 28 అర్ధ రాత్రి వరకు ఎన్నారై టీడీపీ అమెరికా (NRI TDP USA) ఆధ్వ‌ర్యంలో 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడ‌ల్పుతో టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్ లో అతిపెద్ద ఎన్టీఆర్ చిత్ర‌మాలిక ప్రదర్శించారు.

దీనికొరకు NRI TDP USA వారు న్యూ జెర్సీ, న్యూ యార్క్, కనెకక్టికట్ ప్రాంతాలవారికోసం బస్సు ఏర్పాటుచేయగా, మరికొంతమంది తమ కారుల్లో మే 27 రాత్రి 11:30 కల్లా న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ (New York Times Square) వద్దకు చేరుకున్నారు.

కరెక్ట్ గా రాత్రి 12:05 గంటలకు బిల్బోర్డ్ పై నిలువెత్తు ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) కటౌట్ చూడగానే అందరూ కేరింతలు కొడుతూ జై ఎన్టీఆర్ జయహో ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆనందంతో కేక్ కట్ కట్ చేసి అందరికీ పంచారు.

ఈ కార్యక్రమంలో తెలుగు సినీ దర్శకులు చౌదరి, నటీమణులు రజిత, జయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నేత మన్నవ సుబ్బారావు, అలాగే పలువురు ఎన్నారై టీడీపీ (NRI TDP) నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, మహిళలు, ఎన్టీఆర్ అభిమానులు సుమారు 150 మంది వరకు పాల్గొన్నారు.

బహు ప్రాచుర్యం కలిగిన న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్‌ లో ప్ర‌తి 4 నిమిషాల‌కు ఒక‌సారి 15 సెక‌న్ల చొప్పున ఈ ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) ప్ర‌క‌ట‌న‌ ప్ర‌సారం అవుతుండడంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

జయరాం కోమటి (Jayaram Komati) గైడెన్స్ లో, ఎన్నారై టీడీపీ సమర్పణలో, విద్య గారపాటి (Vidya Garapati) ఈ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. మహిళలు సైతం ఎక్కువమంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విశేషం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected