Connect with us

Events

కాన్సస్ నగరంలో తెలుగు జాతి ముద్దు బిడ్డ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు & టీడీపీ మహానాడు

Published

on

విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగు జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామరావు గారి శత జయంతి వేడుకలు మరియు మహానాడు సంబరాలు అమెరికా లోని కాన్సస్ నగరంలో ఎన్నారై టీడీపీ కాన్సస్ సిటీ వారి ఆధ్వర్యం లో ఘనంగా జరిగాయి. మొదట స్థానిక తెలుగు మహళా సీనియర్ శ్రీమతి వెలకటూరి లక్ష్మి నాయుడు గారు మరియు మరి కొంత మంది తెలుగు మహళలు కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

రిచా వల్లూరుపల్లి మరియు శ్రీనివాస్ కోటిపల్లి పాడిన పాటలు అందరిని అలరించాయి. శ్రీనివాస్ దామ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని మరియు కేశవ్ మాగంటి అమరావతి ని రాజధాని గా ఉంచాలని తీర్మానించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 15 మంది టీడీపీ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.

వెంకట్ నల్లూరి , శిల్ప బండ్ల మరియు తదితర స్థానిక నాయకులు, అభిమానులు ప్రసంగించారు. దాదాపు 300 మంది టీడీపీ అభిమానులు మరియు సానుభూతిపరులు పాల్గొన్న ఈ కార్యక్రమం జరిగినంత సేపు ‘జోహార్ అన్న ఎన్టీఆర్!’, ‘జై బాబు.. జై జై బాబు!’ నినాదాలతో హోరెత్తింది.

ఎన్నారై టీడీపీ కాన్సస్ సిటీ ముఖ్య సభ్యులు రావు ద్రోణవల్లి, అరుణ్ కొమ్మినేని, వెంకట్ నల్లూరి, ప్రకాష్ కన్యదార, రతన్ కొమర్నేని, మురళి నార్ల, నాయుడు వట్టిగుంట, గౌతమ్ నల్లూరి, శ్రీనివాస్ కోడె, సురేష్ తుమ్మల, హరి బండ్ల, గోపి మాదాల, శ్రీధర్ కొడాలి, వెంకట్ గొర్రెపాటి, సోమశేఖర్ పెమ్మసాని మొదలగు వారు ఈ కార్య క్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో యువ నాయకులు సాయి నంబూరి మరియు తదితర కాన్సస్ సిటీ యువ నాయకులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా వేణు కొల్ల , సాయి మనీంద్ర మరియు మధు ఉప్పగండ్ల ఎన్నారై టీడీపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి దాదాపు 150 మంది కొత్త సభ్యులని చేర్పించారు.

కళ్యాణ్ పెమ్మసాని , శ్రీనివాస్ కుదరవల్లి మరియు కమలాకర్ అనంతనేని భోజన ఏర్పాట్లు నిర్వహించారు. చంద్ర గన్నె గారు సభా ప్రాంగణమంతా ఫోటోలు మరియు వీడియోలు తీసి ఈ కార్యక్రమం విజయవంతమవ్వడానికి దోహదపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం పని చేసిన అందరికి మరియు దాతలు మనోహర్ నాయుడు వెలకటూరి, ప్రకాష్ కన్యదార, బాపు రెడ్డి మోతె, శివ జాస్తి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected