Connect with us

News

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా అభిమానుల శ్రద్ధాంజలి @ Cumming, Georgia

Published

on

Atlanta, Georgia: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, అన్న స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా జార్జియా (Georgia) రాష్ట్రం, అట్లాంటా నగరంలో లో NTR అభిమానులు ఘన నివాళులు అర్పించారు.

జనవరి 18, ఆదివారం మధ్యాహ్నం, ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా (NTR Trust Atlanta) ఆధ్వర్యంలో జార్జియా రాష్ట్రంలోని కమ్మింగ్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది NTR అభిమానులు, తెలుగుదేశం పార్టీ (TDP) సానుభూతిపరులు, నాయకులు హాజరయ్యారు.

ఈ NTR విగ్రహాన్ని 2024లో నారా లోకేష్ (Nara Lokesh) ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అన్నగారి సేవలను స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి పలువురు ప్రసంగించారు.

అలాగే ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) సేవలను మరోమారు నెమరువేసుకున్నారు. ఎన్టీఆర్ అమర్ రహే, జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. కొరుక్కుతినే చలిలో కూడా ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎన్టీఆర్ గొప్పతనానికి నిదర్శనం అని పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మధుకర్ యార్లగడ్డ, కోటేశ్వరరావు కందిమళ్ల (Koteswara Rao Kandimalla), నరేంద్ర నల్లూరి, చైతన్య, మల్లిక్ మేదరమెట్ల (Mallik Medarametla), శ్రీనివాస్ లావు, కృష్ణప్రసాద్ సోంపల్లి (KP Sompally), అంజయ్య చౌదరి లావు మరియు వినయ్ మద్దినేని పాల్గొన్నారు.

అలాగే మహేష్ కొప్పు (Mahesh Koppu), శ్రీనివాస్ ఉప్పు, కృష్ణ ఇనపకుతిక, శేఖర్ కొల్లు, మోహన్ దేవు, సునీల్ దేవరపల్లి (Suneel Devarapalli), సుధాకర్ బొడ్డు, చవన్ కోయ, విజయ్ కొత్తపల్లి, విజయ్ బాబు కొత్త, వినయ్ బొప్పన, యశ్వంత్ జొన్నలగడ్డ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected