Connect with us

People

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి @ Chicago, Illinois

Published

on

అన్న నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి సందర్భంగా చికాగో (Chicago) నగరంలో ఎన్ఆర్ఐ టీడీపీ చికాగో (NRI TDP Chicago) కమిటీ మరియు స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ హేమ కానూరు గారి ఆధ్వర్యంలో ఎన్నారైలు అందరూ అన్న గారికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల్ ఆఫ్ ఇండియా (Mall of India) ఓనరు, 14 రీల్స్ అధినేత, బిజినెస్ మ్యాన్ శ్రీ అనిల్ సుంకర గారు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ రామకృష్ణ గుళ్లపల్లి గారు విచ్చేసినారు. అతిథుల చేతుల మీదగా అన్న గారికి జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వివిధ వక్తలు ప్రసంగిస్తూ… ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. తరాలు మారినా, యుగాలు గడిచిన ఎన్టీఆర్ (NTR) చరిత్ర తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మణీయంగా నిలిచి పోతుందని అన్నారు.

చికాగోలో (Chicago) ఉష్ణోగ్రతలు -12 సెంటిగ్రేడ్ కు పడిపోయిన కూడా అభిమానులు అశేషంగా కుటుంబ సమేతంగా రావడం అన్న గారి మీద అభిమానాన్ని తెలియచేస్తుంది. ఈ కార్యక్రమానికి యుగంధర్ యడ్లపాటి, చంద్రశేఖర్ పెమ్మసాని, అనిల్ సుంకర అధ్యక్షత వహించారు.

హేమ కానూరు పర్యవేక్షణలో చికాగో ఎన్నారై టీడీపీ (NRI TDP) అధ్యక్షుడు రవి కాకర, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెదమల్లు, ట్రెజరర్ విజయ్ కొరపాటి, రీజనల్ కౌన్సిల్ చిరంజీవి గల్లా, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, శివ త్రిపురనేని, కృష్ణ మోహన్, మూర్తి కొప్పాక, సునీల్ ఆరుమిల్లి, కళ్యాణ్ విష్ణు విలాస్, నాగేంద్ర వేగే, ప్రమోద్ చింతమనేని తదితరులు తమ సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమం విజయవంతం అవ్వడం లో తోడ్పడ్డారు.

error: NRI2NRI.COM copyright content is protected