విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డా|| నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి ఉత్సవాలు Birmingham, Alabama, USA లో 24th May, శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద యెత్తున తెలుగు ప్రజలు, అన్న ఎన్టీఆర్ (NTR) గారి అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
ప్రతీ సంవత్సరం లాగానే.. ఆనవాయితీగా అన్న ఎన్టీఆర్ (NTR) గారి జయంతి రోజున నిరాశ్రయులకు (Homeless people) కు అన్నదాన కార్యక్రమం (Food Donation Drive) The Jimmie Hale Mission, Homeless Shelter, Birmingham, Alabama లో నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో బాల బాలికలు పాల్గొని, స్వయంగా వండి వడ్డించటం (Cooking & Serving) ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు ప్రసంగిస్తూ.. ఎన్టీఆర్ గారు తెలుగు జాతికి చేసిన సేవలు గుర్తుచేసుకుంటూ.. పేద, బడుగు బలహీనవర్గాలకు NTR చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
“పేదవారికి పట్టెడన్నం పెట్టాలి” అనే అన్నగారి ఆశయస్ఫూర్తిగా, నిరాశ్రయులకు భోజనం పంచటం, వారికి అవసరమైన వస్తు సామాగ్రిని అందించటం లాంటి ఈ సేవా కార్యక్రమం అన్న (Nandamuri Taraka Rama Rao – NTR) గారికి ఇచ్చే అసలైన ఘన నివాళి అని పలువురు ప్రశంసించారు.
అదే విధంగా .. భావితరాలకు ఎన్టీఆర్ గారి గొప్పతనం మరియు ఆశయాలు చేరవేసేందుకు, బాలలకు NTR (Nandamuri Taraka Ramarao) గారిపై వ్యాసరచన (Essay Writing) మరియు చిత్రలేఖనం (Drawing) పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించి బాలబాలికలను ప్రోత్సహించారు.
చివరగా ఈ కార్యక్రమం ఇంతటి విజయవంతం కావటానికి సహాయ సహకారాలు అందించిన వారికీ, బాల బాలికలను ప్రోత్సహించిన తల్లితండ్రులకు మరియు హాజరయిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.