Connect with us

Celebrations

ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రాలో ఎన్టీఆర్ శత జయంతి వేడుక

Published

on

ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా నగరంలో వేడుకగా ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) శత జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ హీరో శివాజీ (Sivaji) హాజరయ్యారు.

కాన్బెర్రా (Canberra) అన్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ జరిపిన ఈ కార్యక్రమానికి నాట ప్రెసిడెంట్ ప్రసాద్ తిపిర్నేని అధ్యక్ష్యత వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ సింప్లిసిటీ, పని పట్ల ఉండే అంకితభావం, ప్రజలు అవసరాలకు తగ్గట్టు సాయం చేయడం ఆయన లోని గొప్పతనం అన్నారు.

ముఖ్య అతిథి హీరో శివాజీ మాట్లాడుతూ.. పేదరిక నిర్ములన, అవినీతి నిర్ములన, అసమానతలు తొలిగించడమే ధేయంగా కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు (NTR) అని కొనియాడారు.

రాజకీయాలలో ఎన్టీఆర్ (NTR) లాంటి నిబద్దత, నిజాయితీ ఉన్న వ్యక్తులు ఇప్పుడు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా పలువురికి వారి చేసిన సేవలకు గాను హీరో శివాజీ చేతుల మీదుగా అవార్డులు (Awards) ప్రధానం చేశారు.

అన్న నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి వేడుక (100 Years Celebrations) విజయవంతం చేయడం కోసం అనేక మంది కష్టపడ్డారు అని, వారి అందరకీ పేరుపేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు నిర్వాహకులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected