Connect with us

Birthday Celebrations

Richmond, Virginia: ఘనంగా యుగపురుషుని శతజయంతి ఉత్సవాలు

Published

on

గ్రేటర్ రిచ్మండ్ నగరంలో మార్కెట్ కేఫ్ లో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ శ్రీ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమములో సుమారు 250 పైచిలుకు అన్నగారి అభిమానులు అందులో మఖ్యంగా ఆడపడుచులు పెద్ద ఎత్తున హాజరుకావటం విశేషం.

జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం అయిన ఈ వేడుకలో పిల్లలు పెద్దలు ఆధ్యంతం చాలా ఉత్సంహంగా పాల్గొన్నారు. అన్నగారు చేసిన సేవలు తెలుగువారికి తెచ్చిన గుర్తింపు పలువురు వక్తలు గుర్తు చేసుకున్నారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించే క్రమంలో ఆ మార్పు తన సొంత ఇంటి నుండే ప్రారంభించటం ఆయన గొప్ప తనానికి, నిబద్దత కి నిదర్శనం అని పాల్గొన్న మహిళలు వాళ్ళ అభిప్రాయాలు పంచుకున్నారు.

సినీ, రాజకీయ రంగంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఒక సంచలనమే ఆయన జీవితవిధానం ఎప్పటికి స్ఫూర్తిదాయకమే అని, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తి మనసావాచ పాటించిన కర్మ యోగి అన్న రామన్న అని పెద్దలు పేర్కొన్నారు. సుమారు ఐదు గంటలు పైన జరిగిన ఈ వేడుకల్లో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.

వేడుకుల నిర్వాహకులు శంకర్ మాకినేని, గణేష్ కందుల, కోటి పంగులూరి, శ్రీధర్ యేళ్ళ, రావు క్రొత్తపల్లి, శివ ఏటూరు, సత్య కిరణ్ యలమంచిలి మరియు అన్న తారకరాముని రిచ్మండ్ అభిమానులు వచ్చిన వారందరికీ ధన్యవాదములు తెలిపారు. చివరగా తెలుగింటి భోజనాలతో ఈ కార్యక్రమం ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected