NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అంబరాన్ని ఆంటేలా అన్నగారి శతజయంతి సంబరాలు అన్నగారి జీవిత విశేషాలతో ఆహతుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా అన్నగారి విగ్రహావిష్కరణ మరియు 100 చదరపు అడుగుల కేక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
వినాయక శ్లోకంతో మొదలయిన కార్యక్రమం, అన్నగారితో అనుబంధం ఉండి పెద్దయనతో కలిసి పనిచేసిన లండన్ సీనియర డాక్టర్లు సూర్యదేవర ప్రసాద్ రావు గారు, దాసోజు రాములు గారు, వెలగపూడి బాపూజీ రావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి అన్నగారితో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలని పంచుకున్నారు.
ఒక నటుడిగా మొదలయి తెలుగు జాతి ఇలావేల్పుగా అన్నగారు ఎదిగిన ప్రస్థానంలో తమకు ఎదురైన అనుభూతుల్ని పంచుకున్నారు. 1000 కి మందికి పైగా హాజరైన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 8 వరకు ఆహుతుల్ని కట్టిపడేసింది.అన్నగారి జీవిత విశేషాలలు,ఆయన సాధించిన విజయాలు, తెలుగు జాతికి అందించిన ఫలాల వివరాలతో కూడిన ప్రెజెంటేషన్ ఆహుతల్ని విశేషంగా ఆకట్టుకుంది.
కార్యక్రమానికి రత్నశ్రీ ఉప్పాల వ్యాఖ్యాతగా వ్యవహరించగా, అన్నగారి పాటలతో కూడిన Medley డాన్స్ యువతని ఉర్రూతలూగించింది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు నేలని లండన్లో ఆవిష్కరింప చేసినట్లుంది.
NTR ఆశయాలు, ఆలోచినల్ని నేటి తరానికి పరిచయం చేస్తూ, ఆయన స్పూర్తితో నేటి తరం మరిన్ని విజయాల్ని అందుకునే లా ప్రజల్లో చైతన్యం నింపటం కోసం NRI TDP UK చేపడుతున్న, చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాలికని ఈ సందర్బంగా పంచుకున్నారు.
అన్నగారు ఇచ్చిన ఆత్మ గౌరవం నుంచి చంద్రబాబు గారి నింపిన ఆత్మ విశ్వాసం వరకు తెలుగుజాతి ప్రస్థానం మీద చేసిన ప్రసంగాలు యువతని ఉర్రూతలూగించాయి. ఈ సందర్బంగా అన్నగారి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆక్షరనగా నిలిచింది.
ఈ సందర్భంగా తెలుగు రుచులతో ఏర్పాటు చేసిన విందు భోజనాలు వేడుకలకి మరింత పండగ శోభని అద్దాయి. తెలుగు ప్రజల అస్తిత్వానికి సూచిక అయిన అన్నగారి శత జయంతి వేడుకలకి UK వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు అన్నీ మొట్టమొదటి సారి ఏకతాటి మీదకి రావటం శుభసూచకం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పంజాబీ డోలే నృత్యాలు, బాణా సంచా వేడుకలు & శత జయంతికి సూచికగా 100 NTR ఆకారంలో అభిమానులు చేసిన మానవహారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. NRI TDP UK Team సహకారంతో టీడీపీ యూకే ప్రెసిడెంట్ వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో లండన్ నగరంలో అన్నగారి శతజయంతి వేడుకలు, టీడీపీ మినీ మహానాడు వేడుకలు అంబరాన్ని అంటాయి.