Connect with us

Convention

చక్కని ఆతిధ్యంతో కోలాహలంగా ప్రారంభమైన NRIVA గ్లోబల్ కన్వెన్షన్ @ St. Louis, Missouri

Published

on

. కోలాహలంగా NRIVA 7వ గ్లోబల్ కన్వెన్షన్ ప్రారంభం
. సెయింట్ లూయిస్ లో మొదటి NRIVA కన్వెన్షన్ సూపర్ హిట్
. అమెరికా నలుమూలల నుంచి తరలి వచ్చిన వాసవైట్స్
. అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి, కన్వీనర్ ఎల్ ఎన్ రావు చిలకల కష్టే ఫలి
. 43 కమిటీల కృషే ఘనమైన ప్రారంభానికి కారణం
. ఎయిర్పోర్ట్ పికప్స్, హోటల్, భోజన ఏర్పాట్లతో ఆతిధ్యం అదరహో
. సెలబ్రిటీస్ తో మమేకమైన వాసవైట్స్

ఎన్నారై వాసవి అసోసియేషన్ (NRIVA) 7వ గ్లోబల్ కన్వెన్షన్ మిస్సోరి రాష్ట్రం, సెయింట్ లూయిస్ నగరంలో జులై 4, గురువారం రోజున కోలాహలంగా ప్రారంభమయింది. అమెరికాస్ సెంటర్ ఈ NRIVA కన్వెన్షన్ కి వేదికగా నిలిచింది. ఉదయం నుంచే అమెరికా నలుమూలల నుండి వాసవైట్స్ తరలి వచ్చారు.

NRIVA అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి, కన్వీనర్ ఎల్ ఎన్ రావు చిలకల, కో-కన్వీనర్ వంశి గుంటూరు, కన్వెన్షన్ సెక్రటరీ ఫణీశ కోడూరి, కన్వెన్షన్ ట్రెజరర్ శేఖర్ పేర్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రమేష్ బాపనపల్లి, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తడకమళ్ల, ట్రెజరర్ గంగాధర్ ఉప్పల ఆధ్వర్యంలో ఇతర బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు వివిధ కమిటీల సహకారంతో చక్కని ఆతిధ్యంతో కూడిన ఏర్పాట్లు చేశారు.

రెజిస్ట్రేషన్, తేనీటి విందు అనంతరం సాయంత్రం వ్యాఖ్యాతలు వర్షిణి మరియు సమీరా బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలికి NRIVA కన్వెన్షన్ కమిటీ కోర్ మెంబెర్స్ ని ఫ్యామిలీస్ తో వేదిక మీదకు ఆహ్వానించగా జ్యోతి ప్రజ్వలన (Lighting Lamp) గావించారు. గణేష్ స్తోత్రం మరియు అమెరికా, ఇండియా జాతీయగీతాలు ఆలపించారు.

ముందుగా బాంక్వెట్ ఛైర్ ప్రసంగించారు. క్లాసికల్ నృత్యంతో ప్రారంభించి, ఫ్యూజన్, సినిమా పాటలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) అందరినీ అలరించాయి. NRIVA అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి (Srinivasa Rao Pandiri) వేదికను అలంకరించగానే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

తర్వాత కన్వీనర్ ఎల్ ఎన్ రావు చిలకల (L N Rao Chilakala) కన్వెన్షన్ లీడర్షిప్ సభ్యులను కుటుంబ సమేతంగా వేదిక మీదకు ఆహ్వానించి పుష్పగుచ్ఛాలతో అభినందించారు. అలాగే NRIVA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (NRI Vasavi Association Board of Trustees) ని కూడా సతీసమేతంగా అభినందించారు.

వాసవి మాత జీవిత వృత్తాంతాన్ని ప్రతిబింభిస్తూ ప్రదర్శించిన దృశ్య కావ్యం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. జై వాసవి మాత అంటూ ఆహ్వానితులు అమ్మవారిని పలుమార్లు తలచుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి స్టాండింగ్ ఒవేషన్ (Standing Ovation) తో అభినందనలు తెలపడం విశేషం.

వివిధ రంగాలలో సేవలందిస్తున్న పలువురు వాసవైట్స్ కి ఈ గ్లోబల్ కన్వెన్షన్ వేదికగా వీడియో ప్రోమోస్ ప్రదర్శించి, ఘనంగా అవార్డులు (Awards) అందించారు. సమాజ సేవ (Community Service) విభాగంలో NRIVA బోస్టన్ చాప్టర్ నుంచి దివాకర్ జంద్యం (Divakar Jandyam) కి అవార్డు అందజేశారు. సినీ నటి లయ, బిగ్ బాస్ రన్నరప్ అమర్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందజేయడం కొసమెరుపు.

తదనంతరం గత కన్వెన్షన్ల కన్వీనర్లను సభాముఖంగా సన్మానించారు. ఎక్కడికక్కడ అందరూ సెలబ్రిటీస్ (Celebrities) తో ఫోటోలు దిగుతూ సందడిగా కనిపించారు. NRIVA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తో కలిసి అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం (July 4th) సందర్భంగా చేసిన ఫ్లాష్ మోబ్ డాన్స్ (Flash Mob Dance) ఆకట్టుకుంది.

అలాగే NRIVA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తమ సతీమణులతో ఓల్డ్ సాంగ్స్ నుండి రీసెంట్ సాంగ్స్ వరకు కలిపి చేసిన ప్రత్యేక డాన్స్ ప్రోగ్రాం మరోసారి స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. వన్స్ మోర్ అంటూ వాసవైట్స్ (Vasavites) వేదిక ప్రాంగణాన్ని కోలాహలంగా మార్చారు.

హాస్పిటాలిటీ, ఏర్పాట్లు, భోజన సదుపాయాలు సూపర్. డిన్నర్ కి ముందు వాలంటీర్స్ (Volunteers) ప్రతి టేబుల్ దగ్గిరకి వెళ్లి మరీ వెల్కమ్ డ్రింక్ అందించడం అభినందనీయం. ఈ హాస్పిటాలిటీ విషయంలో NRIVA నాయకులను (NRI Vasavi Association Leaders) తప్పకుండా అభినందించాల్సిందే.

మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వందన సమర్పణతో మూడు రోజుల కన్వెన్షన్ లోని మొదటి రోజుని అత్యంత ఘనంగా ముగించారు.సేవా కార్యక్రమాలతో 15 ఏళ్లకు పైగా అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల లోనూ మంచి పేరు తెచ్చుకున్న NRIVA సంస్థ యొక్క కన్వెన్షన్ రెండో రోజు విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం.

మిస్సోరి (Missouri) రాష్ట్రం, సెయింట్ లూయిస్ (St. Louis) నగరంలో జులై 4న కోలాహలంగా మొదలైన NRIVA గ్లోబల్ కన్వెన్షన్ కి సంబంధించిన మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/NRIVA 7th Global Convention in St. Louis Missouri USA ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected