ఎన్నారై వాసవి అసోసియేషన్ (NRIVA) అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న మూడు రోజుల గ్లోబల్ కన్వెన్షన్ (Convention) మొన్న జులై 4న ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. కన్వెన్షన్ మొదటి రోజైన బాంక్వెట్ డిన్నర్ విజయవంతం కాగా, నిన్న కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు ఎన్నారై వాసవి అసోసియేషన్ ప్రిన్సిపుల్స్ కి నిలువెత్తు నిదర్శనంగా సాగాయి.
NRIVA అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి, కన్వీనర్ ఎల్ ఎన్ రావు చిలకల, కో-కన్వీనర్ వంశి గుంటూరు, కన్వెన్షన్ సెక్రటరీ ఫణీశ కోడూరి, కన్వెన్షన్ ట్రెజరర్ శేఖర్ పేర్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రమేష్ బాపనపల్లి, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తడకమళ్ల, ట్రెజరర్ గంగాధర్ ఉప్పల ఆధ్వర్యంలో ఇతర బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు వివిధ కమిటీల సహకారంతో కన్వెన్షన్ రెండో రోజు కూడా మంచి ఏర్పాట్లు చేశారు.
జులై 5 ఉదయాన్నే అమెరికా, కెనడా లోని NRIVA చాఫ్టర్స్ అందరితో పరేడ్ (Parade) నిర్వహించారు. ప్రతి చాప్టర్ ఒక థీమ్ తో ప్రత్యేకతను చాటుతూ, నృత్యాలు చేస్తూ, వాసవి మాతని కొలుస్తూ, డప్పుల నడుమ మిస్సోరి రాష్ట్రం, సెయింట్ లూయిస్ లోని అమెరికాస్ కన్వెన్షన్ సెంటర్ (America’s Center) లాబీలో ముందుకు సాగాయి.
అనంతరం కన్వెన్షన్ మెయిన్ స్టేజ్ పై శ్రీ శివ పార్వతుల కళ్యాణం వైభోగంగా నిర్వహించారు పండితులు. పూజ ప్రాశస్త్యాన్ని విపులంగా వివరిస్తూ శ్రీ శివ పార్వతుల కల్యాణాన్ని వీనుల విందుగా, భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అలాగే శ్రీ శివ పార్వతులను కన్వెన్షన్ సెంటర్ (America’s Center) లో ఊరేగించారు.
ఆ తర్వాత వివిధ బ్రేకౌట్ రూమ్స్ లో మాట్రిమోనీ (Matrimony), బిజినెస్ సెషన్, ఉమెన్స్ ఫోరమ్ (Women’s Forum), స్టాక్స్, ఆర్ధిక సదస్సు, ఇమ్మిగ్రేషన్ సదస్సు, యూత్ ఎంట్రప్రెన్యూర్ సెషన్, రియల్ ఎస్టేట్, పొలిటికల్ డిస్కషన్, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, బ్యూటీ పాజెంట్ (Beauty Pageant) పోటీలు నిర్వహించారు.
పొలిటికల్ మీట్ లో తెలంగాణ నుంచి (Telangana) 2019 లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన బీజేపీ (Bharatiya Janata Party) నేత దేవకి వాసుదేవ రావు, తమిళనాడు (Tamil Nadu) బీజేపీ స్టేట్ సెక్రెటరీ డా. SG సూర్య మరియు తెలంగాణ చార్టెడ్ అకౌంటెంట్స్ ఫోరమ్ ప్రెసిడెంట్ CA విజయ్ కలిమిచెర్ల తదితరులు పాల్గొన్నారు.
ఆహ్వానితులందరూ తమ అభిరుచుల మేరకు అన్ని సెషన్స్ కలియ తిరిగారు. అలాగే మధ్యాహ్నం మెయిన్ స్టేజీపై వీగాట్ టాలెంట్ సింగింగ్ పోటీల (Singing Competition) ఫైనల్స్ నిర్వహించారు. భోజనాల అనంతరం అందరూ వాసవైట్స్ టాలెంట్ ని ముచ్చటగా ఆలకించారు.
తెలుగు టీవీ యాంకర్ వర్షిణి (Varshini Sounderajan) మరియు సమీరా (Sameera) అందరికీ వార్మ్ వెల్కమ్ అంటూ సాయంత్రం కార్యక్రమాలను ప్రారంభించారు. NRIVA అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి ఏవీ ప్రదర్శించగా, సభికులను ఉద్దేశించి NRIVA సేవాకార్యక్రమాలు, తన అనుభవాలను, అందరి సహకారాన్ని గురించి ప్రసంగించారు.
పుస్తక మిత్ర, గ్రంధాలయాలు ఏర్పాటు, అడాప్ట్ ఏ స్టూడెంట్ వంటి NRIVA సిగ్నేచర్ ప్రాజెక్ట్స్ గురించి, తన కుటుంబం అందించిన సపోర్ట్ గురించి వివరించారు. ఇంత చక్కని ప్లాట్ఫామ్ ఏర్పాటుచేసి తనకి అవకాశం ఇచ్చినందుకు NRIVA వ్యవస్థాపకులు ఆనంద్ గార్లపాటి (Anand Garlapati) మరియు విజయ్ చావా (Vijay Chava) లను అభినందించారు.
తదనంతరం డా. విజయ్ గుప్తా మొదడుగు ని వేదికపైకి సాదరంగా తోడ్కొని వచ్చి NRIVA లీడర్షిప్ (NRI Vasavi Association Leaders) అంతా కలిసి జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా డా. విజయ్ గుప్తా మొదడుగు సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.
అలాగే వివేక్ సండ్రపాటి, బృహత్ సోమ, శీర్ష సాయి పొన్నూరు ల ప్రతిభను గుర్తిస్తూ యూత్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (Youth Excellence Awards) అందించారు. NRIVA థీమ్ సాంగ్ కంపోజ్ చేసిన కార్తీక్ కొడకండ్ల ని పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించారు. జితేంద్ర వివిధ సినీ నటుల గొంతుకు అనుకరిస్తూ మిమిక్రీ చేసి అలరించారు.
మిస్సోరి రాష్ట్ర సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ ఆష్క్రోఫ్ట్ (John Ashcroft) జులై 5 ని ఎన్నారై వాసవి అసోసియేషన్ డే గా ప్రకటిస్తూ ప్రొక్లమేషన్ అందించడం విశేషం. ఈ సందర్భంగా తనుప్రసంగిస్తూ NRIVA సంస్థ సేవలను అభినందించారు. NRIVA అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి జాన్ ఆష్క్రోఫ్ట్ కి మిస్సోరి గవర్నర్ అయ్యే విషయంలో గుడ్ లుక్ అంటూ విషెస్ తెలిపారు.
ప్రస్తుత ప్రెసిడెంట్ ఎలెక్ట్ రమేష్ బాపనపల్లి (Ramesh Bapanapalli) రాబోయే 2025-26 కాలానికి అధ్యక్షునిగా తన బోస్టన్ (Boston) టీంతో ఉల్లాసంగా వేదికపైకి విచ్చేశారు. రమేష్ బాపనపల్లి మాట్లాడుతూ… కన్వెన్షన్ టీం ని, శ్రీనివాస రావు పందిరి ని, కమిటీస్ ని అభినందించారు.
అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఇళయరాజా లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ (Ilaiyaraaja Live Musical Concert) అంగరంగ వైభంగా జరిగింది. 81 ఏళ్ళ వయసులో కూడా అదే ఎనర్జీ తో ఇళయరాజా ఆహ్వానితులను సంగీత ప్రపంచంలో తెలియాడేలా చేశారు. తన బ్లాక్బస్టర్ పాటలతో, తన ట్రూప్ అంతా కలిసి కన్వెన్షన్ కి ఊపు తెచ్చారు.
NRIVA జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తడకమళ్ల (Praveen Thadakamalla) స్పాన్సర్స్ కి, కన్వెన్షన్ కి విచ్చేసిన వాసవైట్స్ కి, సెలబ్రిటీస్ కి, వెన్యూ సిబ్బందికి ఇలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి కన్వెన్షన్ రెండో రోజు కార్యక్రమాలకు ముగింపు పలికారు.