Connect with us

Convention

శ్రీ శ్రీ రవి శంకర్ సందేశం, త్రీరీ బ్యాండ్ రాక్ సాలిడ్ విభావరితో కన్వెన్షన్ కి శుభం కార్డు: NRIVA 7th Global Convention @ St. Louis, Missouri

Published

on

అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి, కన్వీనర్ ఎల్ ఎన్ రావు చిలకల, కో-కన్వీనర్ వంశి గుంటూరు, కన్వెన్షన్ సెక్రటరీ ఫణీశ కోడూరి, కన్వెన్షన్ ట్రెజరర్ శేఖర్ పేర్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రమేష్ బాపనపల్లి, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తడకమళ్ల, ట్రెజరర్ గంగాధర్ ఉప్పల ఆధ్వర్యంలో ఇతర బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు వివిధ కమిటీల సహకారంతో సెయింట్ లూయిస్ లో నిర్వహించిన NRIVA 7వ గ్లోబల్ కన్వెన్షన్ ఘనంగా ముగిసింది.

జులై 6 తేదీన కూడా ఉదయం యోగా, మెడిటేషన్ (Meditation) సెషన్స్ తో ప్రారంభమై రాత్రి త్రీరీ బ్యాండ్ (Threeory Band) వారి రాక్ సాలిడ్ సంగీత విభావరితో కన్వెన్షన్ కి శుభం కార్డు పడింది. అందరూ వేయికళ్లతో ఎదురు చూసిన అంబాసిడర్ ఆఫ్ పీస్, గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ (Sri Sri Ravi Shankar) ఆధ్యాత్మిక సందేశం అందరి మనసులను తాకింది.

న్యూ జెర్సీ వాసి కళ్యాణ్ విజయ్ లక్కింశెట్టి గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ తో ముఖ్య వేదికను పంచుకునే అదృష్టం దక్కించుకున్నారు. 60 సంవత్సరాలు దాటిన దంపతుల పుట్టిన రోజు వేడుకల శతమానంభవతి పూజ అజరామరం. ఈ కన్వెన్షన్ కన్వీనర్ ఎల్ ఎన్ రావు (LN Rao Chilakala) చిలకల ప్రతి ఒక్కరి ఆశీస్సులు తీసుకోవడం అభినందనీయం.

సమాంతరంగా వివిధ బ్రేకౌట్ రూమ్స్ లో బ్యూటీ పాజెంట్ మరియు పాటల పోటీల ఫైనల్స్ ఒక పక్క నిర్వహిస్తుండగానే, మరో పక్క మహిళల కోసం ప్రత్యేక సరదా పోటీలు, బహుమతులు, మాట్రిమోనీ, రియల్ ఎస్టేట్ సదస్సు, యూత్ ఎంట్రప్రెన్యూర్ సెషన్స్ నిర్వహించారు. అలాగే గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

ఎప్పటిలానే ఈ కన్వెన్షన్ లో కూడా జనరల్ బాడీ మీటింగ్ (General body Meeting) నిర్వహించారు. NRIVA సంస్థ యొక్క గత 2 రెండు సంవత్సరాల పురోగతి, ఇండియా మరియు అమెరికాలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, మెంబర్షిప్ తదితర విషయాలకు సంభందించిన వివరాలు అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి (Srinivasa Rao Pandiri) అందరికీ తెలియపరిచారు.

ఇక సాయంత్రం మెయిన్ స్టేజీపై సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) ఆహ్వానితులను అలరించాయి. హూస్టన్, డల్లాస్, మేరీల్యాండ్, అట్లాంటా, న్యూ జెర్సీ, ఫీనిక్స్ NRIVA చాఫ్టర్స్ నుంచి పోటాపోటీగా ప్రదర్శించిన నృత్యాలు, ఫ్యాషన్ వాక్, థీమ్ డాన్స్ వేటికవే సాటి అనేలా ఉన్నాయి.

జబర్దస్త్ వెంకీ మంకీ (Jabardasth Venky Monkey) కామెడీ, బిగ్ బాస్ రతిక డాన్స్, రోబో గణేష్ (Robo Ganesh) ప్రత్యేక నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ కన్వెన్షన్ నిర్వహించిన మూడు రోజులను కూడా NRIVA డేస్ గా అధికారికంగా గుర్తిస్తూ సెయింట్ లూయిస్ కౌంటీ (St. Louis County) ప్రతినిధి ప్రొక్లమేషన్ ని NRIVA నాయకులకు అందజేయడం విశేషం.

ఈ సందర్భంగా NRIVA నాయకులు స్టాండింగ్ ఒవేషన్ తోపాటు సెయింట్ లూయిస్ కౌంటీ ప్రతినిధి ని ఘనంగా సన్మానించారు. అలాగే ఈ 7వ గ్లోబల్ కన్వెన్షన్ ని విజయవంతంగా నిర్వహించడంలో పాత్ర వహించిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులను, చాప్టర్ లీడ్స్, రీజినల్ డైరెక్టర్స్ తదిరులను వేదికపైకి ఆహ్వానించి అభినందించారు.

టాలీవుడ్ ప్రముఖులు అయిన నటి అంజలి (Anjali), సినీ నిర్మాత TG విశ్వ ప్రసాద్, కొరియోగ్రాఫర్ శివ, మాజీ ఎమ్మెల్యే & సినీ నిర్మాత అంబికా కృష్ణ (Ambhika Krishna), బీజేపీ నేత దేవకి వాసుదేవరావు తదితరులను వ్యాఖ్యాత సమీర స్టేజ్ పైకి ఆహ్వానించి సత్కరించారు. ఈ సమయంలో నటి అంజలి వ్యాఖ్యాత సమీర (Anchor Sameera) ప్రశ్నలకు సరదా సమాధానాలతో సభికులలో ఉత్సాహాన్ని నింపారు.

పర్యావరణాన్ని, మట్టి తల్లిని గుర్తుపెట్టుకొని శాలువాలు వాడకుండా ఈసారి అతిథులకు మొక్కలు గౌరవ సూచకంగా అందజేయడం కొసమెరుపు. చివరిగా యువతలో మంచి క్రేజ్ ఉన్న త్రీరీ బ్యాండ్ (Threeory Band) వారు తమ సంగీత విభావరి (Live Musical Concert) తో NRIVA 7వ గ్లోబల్ కన్వెన్షన్ కి ఘనమైన ముగింపు పలికారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected