Connect with us

News

కాలి నడకన తిరుమలకు NRIs, అమెరికా నుంచి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రాక – Tirupati

Published

on

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి అనుముల ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తిరుమల (Tirumala, Tirupati) కొండను కొందరు ప్రవాసులు కాలి నడకతో చేరుకున్నారు. శ్రీ రేవంత్ రెడ్డి (Revanth Reddy Anumula) కి అమెరికా లో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అనుముల, రవి పొట్లూరి, మరి కొందరు శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం లో పాల్గొనేందుకు అమెరికా (USA) నుండి హైదరాబాద్ (Hyderabad) వచ్చారు. వారందరూ ఇంతటి విజయాన్ని శ్రీ రేవంత్ రెడ్డి కి అందించిన తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు తిరుమల చేరుకొన్నారు.

‘మేమందరం ఏడు కొండలు నడిచి ఎక్కుతామని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara) కి మొక్కుకొన్నామని, ఇప్పుడు స్వామి వారి మొక్కు చెల్లించి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలన లో తెలంగాణ రాష్ట్రం (Telangana State) అభివృద్ది చెందాలని కొరుకున్నామని శ్రీ రవి పొట్లూరి తెలిపారు.

అనుముల జగదీశ్వర్ రెడ్డి, కాట్ల రాజు, మిడుదుల సుధీర్ రెడ్డి, స్రవంత్, ఆదిత్య, ముప్పా రాజ శేఖర్ లు తిరుమల (Tirumala) కొండ మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకొని శ్రీ రేవంత్ రెడ్డి (Revanth Reddy Anumula) నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పథంలొ ప్రయాణించాలని కోరుకున్నట్లు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected