Connect with us

News

మేమంతా మీ వెంటే అంటూ చంద్రబాబుకి సంఘీభావం @ Milwaukee, Wisconsin

Published

on

ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి, రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన విపక్షాలను మట్టుపెట్టే దిశగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలకుల వ్యవహారశైలిని ఖండిస్తూ, నాలుగున్నర దళార్థాల మచ్చలేని నాయకుడు, సుపరిపాలనకు మారు పేరైన నారా చంద్రబాబు నాయుడు పై ఆప్రజాస్వామిక దాడి జరుగుతున్నది.

దీనికి నిరసనగా గత ఆదివారం సెప్టెంబర్ 24న మిల్వాకీ (Milwaukee) లోని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరియు నారా చంద్రబాబు నాయుడు అభిమానులు స్థానిక Wirth Park, Brookfield లో సమావేశమై చంద్రబాబు నాయుడి కి సంగీభావం తెలియచేశారు.

అక్రమ అరెస్ట్ గురించి అనేకమంది వ్యక్తలు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడి బాధను, వారి వారి అనుభవాలను పంచుకున్నారు. అక్రమ అరెస్ట్ ని ఖండించడం జరిగింది. అలాగే అందరూ ఏకమై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలని అందరికి విజ్ఞప్తి చేసినారు.

పార్టీలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కి సంఘీభావంగా నిరసన (Protest) కార్యక్రమానికి విచ్చేసి, జయప్రదం చేసిన అందరికీ కార్యనిర్వాహకులు ధన్యవాదాలు తెలియచేశారు.

కార్యనిర్వాహకులు: చంద్ర ఐనంపూడి గారు, వెంకట్ కొడాలి గారు, రవి నాదెండ్ల గారు, మహేష్ కామన గారు, ఫణి గారపాటి గారు, దుర్గ బండారుపల్లి గారు, వెంకట్ చిగురుపాటి గారు, వెంకటేష్ గారు, సైదారావు గారు, చంద్ర అల్లు గారు, వికాస్ గారు, హేమంత్ కొమ్మి గారు మరియు టీడీపీ కుటుంబ సభ్యులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected