Connect with us

News

Finland రాజధాని Helsinki లో ఏ.యస్. రామకృష్ణ & మన్నవ లతో ప్రవాసుల సమావేశం

Published

on

తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకు రావాలనే కృతనిశ్చయంతో వుందని మాజీ ఎమ్మెల్సీ డా: ఏ.యస్. రామకృష్ణ అన్నారు. ది 09-04-2025 సాయంత్రం ఫిన్లాండ్ (Finland) రాజధాని హెల్సింకీ (Helsinki) లో తెలుగు సంఘాలు, తెలుగుదేశం పార్టీ అభిమానులతో సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఫిన్లండ్ కల్చరల్ అసోసియేషన్ స్పోర్ట్స్ అధ్యక్షుడు రామకృష్ణ వెలగపూడి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… విద్యారంగంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఫిన్లాండ్ (Finland) దేశాన్ని సందర్శించటం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఒక్క విద్యా రంగంలోనే కాదు ….హేపీనెస్ ఇండెక్స్ (Happiness Index) లో కూడా ముందు వరసలో నిలిచిందన్నారు. విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి హేపీనెస్ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్ ను ముందు వరుసలో వుంచటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu Naidu), విద్యాశాఖమంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కృషి చేస్తున్నారు.

గత వైసీపీ (YSR Congress Party) ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది. తెలుగుదేశం (Telugu Desam Party) ప్రభుత్వం దానిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… ఫిన్లాండ్ (Finland) వాసుల జీవితాలు ప్రపంచానికే ఆదర్శమని అన్నారు.

మంచి పౌరుడిగా ఎదగడానికి ఇక్కడ పసి వయసులోనే బీజం వేస్తున్నారు. మార్కులకు, ర్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం. అనంతరం కొన్ని స్కూళ్లను, యూనివర్సిటీలను సందర్శించి విద్యార్థుల తో ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో వెంగళరావు సాధినేని, ఫిన్లాండ్ తెలుగు అసోసియేషన్ (Finland Telugu Association) అధ్యక్షులు రమేష్ కాకర్ల, శ్రీనివాస్ నాగబోయిన, రమేష్ శరణు, సుధాకర్ చల్లగుంట్ల, నక్కా కిషోర్, సుదర్శన్ బాబు నాగినేని తదితరులు పాల్గొన్నారు

error: NRI2NRI.COM copyright content is protected