Connect with us

News

ఫిలడెల్ఫియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రణాళికా సమావేశం

Published

on

యుగపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏడాది అంతటా జరపాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశాలను అనుసరిస్తూ ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ టీమ్ నవంబర్ 17వ తేదీన జూమ్ మీటింగ్ నిర్వహించి తమ నగరంలో జరగబోయే వేడుకను జయప్రదం చేసేందుకు జరగవలిసిన కార్యాచరణ గురించి చర్చించారు.

తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు తమ నగరంలో జరుపుతునందుకు తమకు ఎంతో సంతోషంగా ఉంది అని, ఈ వేడుకకు కుల, మత, ప్రాంతీయ, రాజకీయ పార్టీలకు అతీతంగా తెలుగువారు అందరూ హాజరై విజయవంతం చేస్తారు అని టీమ్ సభ్యులు తెలిపారు.

మొత్తం ప్రణాళిక సిద్ధం అయిన తరువాత తేదీ, వేడుక నిర్వహణ ప్రాంగణం, సమయం, ముఖ్య అతిధుల వివరాలు, నిర్వహించబోయే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన సమాచారం త్వరలోనే వెల్లడిస్తాము అని ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ సభ్యులు అన్నారు.

ఈ జూమ్ మీటింగ్ లో ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ టీమ్ సభ్యులు రవి పొట్లూరి, రవి మందలపు, సునీల్ కోగంటి, సాంబయ్య కోటపాటి, రవి చిక్కాల, కిరణ్ కొత్తపల్లి, రమణ కుమార్, విశ్వనాథ్ కోగంటి, రవి తేజ ముత్తు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected